BigTV English

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Teja Sajja: ఒక పెద్ద దర్శకుడు నన్ను మోసం చేశాడు

Teja Sajja: కొంతమంది దర్శకులు కొన్నిసార్లు కొందరు హీరోలతో సినిమా చేయాలి అని ఫిక్స్ అవుతారు. కొన్ని సందర్భాలలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేస్తుంటాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలా చాలా మంది చేయవలసిన చాలా ప్రాజెక్టులు వేరే వాళ్లకు వెళ్లిపోయాయి. కొంతమంది మాత్రం కొందరు హీరోలను వాడుకుంటారు. డెమో షూట్ కోసం, మాక్ షూట్ కోసం కొంతమందిని వాడుకొని తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంటారు.


రీసెంట్ గా ఇటువంటి హీరో తేజ జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టిన తేజ చాలా చిన్న ఏజ్ లోనే మంచి పేరు సాధించుకున్నాడు. ఒక ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద తేజ నటిస్తున్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా చాలామంది స్టార్ హీరోలు సినిమాల కంటే కూడా మంచి ఆదరణ పొందుకుంది.

ఆ దర్శకుడు మోసం చేశాడు 

ప్రస్తుతం తేజ మిరాయి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. సినిమా మీద అంచనాలు విపరీతంగా పెంచుతున్నాయి. అయితే తేజ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.


తేజ మాట్లాడుతూ “ఒక పెద్ద దర్శకుడు నాకు ఒక కథ చెప్పి నాతో 15 రోజుల మాక్ షూట్ కూడా పూర్తి చేశాడు. కొన్ని రోజుల తర్వాత, మరొక హీరో సెట్స్‌లోకి ప్రవేశించాడు. అప్పుడే నాకు తెలిసింది వాళ్ళు ఆ హీరోని అప్పటికే ఫైనల్ చేశారని మరియు నన్ను మాక్ షూట్ కోసం మాత్రమే ఉపయోగించుకున్నారని. అని చెప్పాడు. మొత్తానికి ఆ పెద్ద దర్శకుడు పేరును మాత్రం బయట పెట్టలేదు.

ఎవరా దర్శకుడు?

అయితే తేజ చెప్పిన తర్వాత ఆ దర్శకుడు ఎవరు అని చాలామందికి క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇప్పుడు చాలామంది డీకోడ్ చేయడం మొదలుపెట్టారు. తేజ మాటలకు ఏకంగా ఆ దర్శకుడు కానీ చిత్ర యూనిట్ కానీ రియాక్ట్ అయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. తేజ లాంటి హీరోకే ఇలా జరిగింది అంటే మిగతా చిన్న చిన్న నటులకి ఇలాంటివి ఎన్నో జరిగి ఉంటాయి. ఇకపోతే తేజ నటిస్తున్న మిరాయి సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Related News

Teja Sajja: అంత మంచి సినిమా ఎలా వదిలేసావు భయ్యా?

Bandla Ganesh: కొడితే నీలా కొట్టాలి రా బాబు దెబ్బ, బండ్లన్న కొత్త భజన?

Ileana D’Cruz: ఆ క్షణం నరకం అనుభవించా.. కొడుకు విషయంలో నిజాలు బయటపెట్టిన ఇలియానా!

TVK Vijay: తలపతి విజయ్ పార్టీ పైన త్రిష ఆసక్తికర కామెంట్స్

Pookie: సోషల్ మీడియా దెబ్బకి పూకి ను కాస్త బూకి చేశారు

Big Stories

×