Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఈ షో ఇప్పుడు తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకుంది. తొమ్మిదవ సీజన్ కూడా ప్రారంభం అయ్యింది. మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు, 6 మంది కామనర్లతో మొదలైన ఈ సీజన్ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత గేమ్ మరింత రసవత్తరంగా సాగుతోందని చెప్పవచ్చు. ముఖ్యంగా 6 మంది వైల్డ్ కార్డులు అడుగుపెట్టిన తర్వాతే అసలైన రణరంగం మొదలైంది అంటూ చూసే ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం ఆరు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో భాగంగా శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. రెండవ వారం మర్యాద మనీష్ , మూడవ వారం ప్రియా శెట్టి , నాలుగవ వారం హరిత హరీష్, ఐదవ వారం దమ్ము శ్రీజ, ఫ్లోరా షైనీ , ఆరవ వారం భరణి శంకర్ ఇలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఏడవ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియకు సన్నహాలు సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది.ఈ సందర్భంగా తాజాగా ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్..
ఇంటి రెండు టీములుగా విడిపోయారు. ఒకరు సంజన టీం కాగా.. మరొకరు దివ్వెల మాధురి టీం.. ఈ రెండు టీంలు కంటెండర్ షిప్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది. అదిరిపోయే గెటప్పులు వేసి ఆడియన్స్ ని నవ్వించారు. అటు ఇమ్మానుయేల్ మొదలు మిగతా హౌస్ సభ్యులు కూడా కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఇకపోతే కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది కానీ ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ అదిరిపోయిన అసలు టాస్క్ చూసి ప్రాణాలు మీదకు తెచ్చేలా ఉన్నారే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే 44వ రోజుకు సంబంధించి 3వ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో రెండు టీం లకు సంబంధించి టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. అందులో గోలి సోడాలను ఉంచారు. సరైన వ్యక్తులు ఆ గోలి సోడా కొడుతూ ఉంటే ఒక్కొక్క టీం తరఫున ఇద్దరు వచ్చి 30 సోడాలని తాగాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ టాస్క్ విధించాడు. పైగా టైం కూడా విధించడంతో ఇమ్మానుయేల్, కళ్యాణ్ – రమ్య, పవన్ నలుగురు కూడా పోటీపడ్డారు. అయితే ఆ గోలి సోడాలను వెంటవెంటనే తాగేసరికి తట్టుకోలేక కాస్త డీలా పడిపోయారు ముఖ్యంగా వారు ఇబ్బందులు పడుతున్న సన్నివేశాలు చూస్తే ఎంటర్టైన్మెంట్ కాస్త ప్రాణాల మీదకు తెచ్చేలా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం తాజాగా విడుదల చేసిన ప్రోమో పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Telusu kada Collections : తెలుసు కదా కలెక్షన్లు… సిద్ధూకు మరో ‘జాక్’ పాట్ ?