Why Madhuri Not in Nomination: బిగ్ బాస్ తెలుగు రోజురోజుకి ఆసక్తిగా మారుతోంది. వైల్డ్ కార్డ్ రాకతో హౌజ్లో రచ్చ మొదలైంది. ఈసారి చదరంగం కాదు.. రణరంగమే అంటున్నారు కంటెస్టెంట్స్. ఆటైనా, పాటైన తగ్గేదే లే అంటూ గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక గొడవలు, వివాదాలకు కొదువే లేదు. కదిలిస్తే చాలు.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా దివ్వెల మాధురి. ఆమె నోరు తెరిస్తే చాలు.. రచ్చ జరుగుతుంది. అమ్మాలా అంటూనే పుల్లలు పెడుతోంది. బ్యాక్ బిచ్చింగ్ చేస్తుంది. హౌజ్లోకి రాగానే దివ్యతో పెట్టుకుంది.
ఆ తర్వాత కళ్యాణ్ ఇలా వరుస పెట్టి హౌజ్‌మేట్స్ బెదరగొడుతుంది. కదిలిస్తే చాలు నోరేసుకుని పడిపోతుంది. మాధురిని చూసి అబ్బా ఏంటి రచ్చ అంటున్నారు ఆడియన్స్. బిగ్‌బాస్ వాయిస్ వింటే హౌజ్లో అందరు ఉలిక్కిపడతారు.. కానీ మీ వాయిస్ వింటే బిగ్ బాసే ఉలిక్కి పడుతున్నాడు అని హైపర్ ఆది అన్నట్టు గానే ఉంది తాజా నామినేషన్స్ చూస్తుంటే. ఎందుకంటే.. నిన్న జరిగిన నామినేషన్స్ లో ఏ ఒక్కరు కూడా మాధురిని నామినేట్ చేయలేదు. నిజానికి ఆమెను హౌజ్ నుంచి పంపించేందుకు హౌజ్ మేట్స్ కి చాలా కారణాలు ఉన్నాయి.
కానీ, ఏ ఒక్కరు కూడా మాధురిని టార్గెట్ చేయలేదు. వచ్చిన రెండు రోజుల్లో మాధురి వల్ల చుక్కలు చూసిన దివ్య కూడా మాధురి పేరు కూడా తీయలేదు. అంటే ఆది అన్నట్టుగానే అంత మాధురి నోరుకు భయపడుతున్నారా అని అనిపిస్తోంది హౌజ్ లో పరిస్థితులు చూస్తుంటే. ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఒక్క మాటంటే కూడా పడని దివ్యకు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం వచ్చింది. కానీ, ఒకటి ఆయేషా, రెండు సాయిలను చిన్న చిన్న కారణాలకే నామినేట్ చేసింది. కానీ, ఏకంగా తనని ఫుడ్ మానిటర్ నుంచి తీయించిన మాధురిని మాత్రం మర్చిపోయింది.
నిజానికి తన ఫస్ట్ నామినేషన్ మాధురే ఉంటుందని అంత అనుకున్నారు. కానీ, తనవైపు కనీసం చూడను కూడా లేదు. కళ్యాణ్ కూడా మాధురిని చేస్తాడనుకుంటే.. ఆట బాగా లేదంటూ సంజనను ఎంచుకున్నాడు. గత వారం హౌజ్ లో అంత రచ్చ చేసిన మాధురిని ఏ ఒక్కరు కూడా నామినేట్ చేసే ధైర్యం చేయలేదు. అంటే ఆమె నోరుకి హౌజంత భయపడుతుందని నెటిజన్స్, ఆడియన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు మాధురిని బిగ్ బాస్‌లోకి తీసుకువచ్చినందుకు బయట తీవ్ర నెగిటివిటీ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇమేజ్ని బట్టి ఇలాంటి వారిని హౌజ్ లోకి తీసుకువచ్చిన సామాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ టీంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.