E-Paper
Advertisement

Bigg Boss Telugu 9 Winner: బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో చెప్పేసిన నికిల్…తనూజ మాత్రం కాదు?

Bigg Boss Telugu 9 Winner: బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరో చెప్పేసిన నికిల్…తనూజ మాత్రం కాదు?
Advertisement

Bigg Boss telugu 9 winner: బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది ఈ కార్యక్రమం ఒక తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే తొమ్మిదవ సీజన్ కూడా ఫినాలే జరుపుకోబోతోంది. ఈ ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ 9 ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతున్న నేపథ్యంలో విన్నర్ ఎవరనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్….

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనే విషయంపై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఇక తనూజ కచ్చితంగా విన్నర్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. అలాగే కళ్యాణ్ కూడా ట్రోఫీ అందుకోబోతున్నారు అంటూ పలువురు వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ (Nikhil)బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా నిఖిల్ బిగ్ బాస్ 9 విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ సీజన్ విన్నర్ ఇమ్మానుయేల్ (Emmanuel)లేదా కళ్యాణ్ పడాల(Kalyan Padala) ఇద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ గా నిలుస్తారని ఈయన తెలియజేశారు.

విజేతగా కళ్యాణ్ పడాల?

Advertisement

బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి తనూజ విన్నర్ గా నిలుస్తుంది అంటూ అందరూ భావించారు కానీ కళ్యాణ్ మాత్రం తనుజ విన్నర్ కాదని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఇక కళ్యాణ్ కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే . ఇలా కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతూ ఉన్నారు.. ఇక కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. మరి మాజీ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ చెప్పిన విధంగానే కళ్యాణ్ కప్పు అందుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమం 15వ వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 14వ వారంలో భాగంగా సుమన్ శెట్టితో పాటు నటుడు భరణి కూడా ఎలిమినేట్ అయ్యారు.. మరొక రెండు రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కానుంది. టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా ఇమ్మానుయేల్, పవన్, కళ్యాణ్, సంజన, తనూజ ఉన్న సంగతి తెలిసిందే.. మరి ఈ ఐదుగురిలో కప్పు ఎవరి సొంతం అవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సీజన్ విన్నర్ కు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆదివారం ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరగబోతోంది. మరి బిగ్ బాస్ 7 లాగే ఈ సీజన్లో కూడా కామన్ మ్యాన్ విజేతగా నిలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×