Bigg Boss 10 Telugu : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. అన్ని ఇండస్ట్రీలలో ప్రసారమవుతున్న ఈ రియాల్టీ షో కోసం జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లో సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో మరికొద్ది రోజుల్లో పదో సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 10కు సంబంధించిన ప్రోమోన్ కూడా రిలీజ్ చేశారు స్టార్ మా.. అయితే ఈ షో మొదలవుతుంది అన్నప్పటినుంచి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఈసారి అగ్నిపరీక్ష కాస్త కొత్తగా ఉండబోతుంది అంటూ నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. దీంతోపాటుగా సెలబ్రిటీల లిస్టు కాస్త ఎక్కువే అని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ యాంకర్ కంటెస్టెంట్ గా రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అంతే కాదు ఆమె రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువే అని తెలుస్తుంది.. ఇంతకీ ఆ స్టార్ యాంకర్ ఎవరు? ఆమె ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర పై బాస్ సీజన్ 10 తెలుగు త్వరలోనే స్టార్ట్ అవనుండటంతో అప్పుడే సందడి మొదలైపోయింది.. కామనర్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. బిగ్ బాస్ లో పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ల నుంచి దాదాపు వేల అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తుంది.. ఇక సెలబ్రిటీల లిస్టు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి ఈ సెలబ్రిటీలు ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారన్న వార్త సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఓ వార్త షికారు చేస్తుంది. ఆ స్టార్ యాంకర్ ఎవరో కాదు.. వింధ్య విశాఖ.. స్పోర్ట్స్ యాంకర్ గా ఈమె పేరు ఈ మధ్య బాగా పాపులర్ అయింది. ఆమెకున్న పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈమెను హౌస్ లోకి తీసుకుంటే సీజన్ సస్పెన్స్ గా ఉంటుంది అని బిగ్ బాస్ టీం అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమెను సంప్రదించినట్లు సమాచారం.. యాంకర్ వింధ్యకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే కాబట్టి హౌస్ లోకి తీసుకొచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఏం జరుగుతుందో ఎవరిని తీసుకురాబోతున్నారు మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సెలబ్రిటీలకు బిగ్ బాస్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. అందులో క్రేజ్ ఎక్కువగా ఉన్న యాంకర్లకు లేదా సింగర్లకు రెమ్యూనరేషన్ కుడా కాస్త ఎక్కువ అన్న విషయం తెలిసిందే.. గత ఏడాది సీజన్తో పోలిస్తే ఈ ఏడాది రాబోతున్న సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ కాస్త ఎక్కువే అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యాంకర్ వింధ్య విశాఖకు రోజుకి 1,50,000 కు పైగానే రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు నెట్టింట ఓ వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త అయితే హాట్ టాపిక్ గా మారింది. ఈమెతో పాటుగా బుల్లితెర సెలబ్రిటీలను ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక త్వరలోనే అగ్నిపరీక్ష కూడా ప్రారంభం కాబోతోంది. ఈసారి ఎలాంటి సామాన్యులకు అవకాశం వస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా ఈ సీజన్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుందని సమాచారం.. ఈసారి కూడా పోస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. మరి బిగ్ బాస్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? సెలబ్రిటీలు సామాన్యుల లిస్టు ఏంటి అన్నది త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.