BB Telugu 8: తాజాగా 13వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకొని టాప్ -5 లో ఉంటాడనుకున్న పృథ్వీరాజ్ శెట్టి (Prithviraj Shetty) ఈ వారం ఎలిమినేట్ అయ్యారు. డబుల్ ఎలిమినేషన్స్ లో భాగంగా నిన్నటి ఎపిసోడ్లో టేస్టీ తేజ (Tasty Teja)ఎలిమినేట్ అవ్వగా ఈరోజు పృథ్వీ రాజ్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇకపోతే బిగ్ బాస్ టీం తీసుకున్న ఈ నిర్ణయంతో పృథ్వీ అభిమానులు పూర్తిస్థాయిలో హార్ట్ అవుతున్నారు. ఇకపోతే ఈయన ఎలిమినేట్ అయినా సరే రెమ్యూనరేషన్ మాత్రం విన్నర్ రేంజ్ లోనే అందుకున్నాడని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ టీం ఇతనికి అన్యాయం చేసిందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అవినాష్ ను కాపాడడం కోసం పృథ్వీ ను బలి చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్నారు టేస్టీ తేజ అవినాష్. ఇక డబుల్ ఎలిమినేషన్స్ లో భాగంగా మొదట టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయ్యి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు. దీంతో ఆ తర్వాత స్థానంలో ఉన్న పృథ్వీ ను ఎలిమినేట్ చేయడం జరిగింది. మరోవైపు ఈయన ఎలిమినేషన్ తో బిగ్ బాస్ టీం పై సోషల్ మీడియాలో పూర్తి వ్యతిరేకత కూడా ఏర్పడుతోంది. హౌస్ లో పులిలా ఆడిన పృథ్వీ రాజ్ శెట్టి ను మీరు ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు హౌస్ లో ప్రతి టాస్క్ లో కూడా ప్రాణం పెట్టి మరీ ఆడాడు. కానీ అతని షార్ట్ టెంపర్ కారణంగా తన ఆటను పక్కనపెట్టి అతని బలహీనతను సాకుగా చూపి తొక్కేయాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడ కూడా బెదరకుండా, భయపడకుండా గట్టిగానే ఆడాడు.
అయితే అదృష్టం మాత్రం కలిసి రాలేదు. దాంతో 13 వారాలకే ఎలిమినేట్ అయ్యాడు. కానీ అతని జెన్యూన్ క్యారెక్టర్ చూసి ఓట్లు వేస్తూ వచ్చారు జనాలు.దాంతో ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ వచ్చారు.. ఎంత బాగా టాస్క్ లు ఆడినా సరే ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఈయన ఆట వల్ల చీఫ్ అయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఎవరూ కూడా కృతజ్ఞత చూపించలేకపోవడం గమనార్హం. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ లో నిఖిల్, విష్ణుప్రియ కూడా ఈయనకు వెన్నుపోటు పొడిచారు. నబీల్ ను దుమ్ము రేపే కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేశారు కానీ ఈయన ఆటను మాత్రం మెచ్చుకోలేదు.. వాస్తవానికి ఫేక్ అనేది లేకుండా తాను బయట ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉన్నానని నిరూపించుకున్నాడు. ఇకపోతే విష్ణు ప్రియ విషయంలో కూడా తాను అనుకున్నది డైరెక్టుగానే చెప్పేశాడు. అంతేకాదు ఈ విషయాన్ని చెప్పి చాలామంది ప్రతి నామినేషన్స్ లోకి తీసుకొచ్చినా.. ఇతని నిజాయితీని నమ్మిన ఆడియన్స్ ఓట్లు వేస్తూ ఈయనను సేవ్ చేశారు.
ఇకపోతే ఈయన రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈ నటుడికి వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెమ్యునరేషన్ ఇస్తూ హౌస్ లోకి తీసుకొచ్చారు. ఈ లెక్కన 13 వారాలకు గానూ రూ.32.5లక్షలు వరకు పృథ్వీరాజ్ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే ప్రైజ్ మనీకి దాదాపు దగ్గరగా రెమ్యునరేషన్ అందుకున్నారు పృథ్వీరాజ్ శెట్టి.