Best waterproof phones in 2024 : బెస్ట్ వాటర్ రెసిస్టెన్సీ మెుబైల్స్ కావావా.. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏడాది లాంఛ్ అయిన టాప్ మెుబైల్స్ లో వాటర్ రెసిస్టెన్సీ మెుబైల్స్ ఎన్నో ఉన్నాయి. వీటి ఫీచర్స్ అదిరిపోయేలా ఉండగా ధర అందుబాటులో ఉంది. మీరూ ఓ లుక్కేయండి.
OnePlus Nord 4 5G – ఈ మెుబైల్ ధర రూ. 29,999. ఇది 5500mAh బ్యాటరీ, 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 7+ Gen 3, 4 Android అప్డేట్స్ తో వచ్చేసింది. 8/12జీబీ ర్యామ్‌తో Snapdragon 7+ Gen 3 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ UFS4.0ని ఉపయోగిస్తుంది. OIS మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ LYT600 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
Motorola Edge 50 Fusion 5G – ఈ మెుబైల్ ధర రూ. 26,318. ఈ మెుబైల్ బెస్ట్ వాటర్ ప్రూఫ్ మెుబైల్. 6.7 డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ, 512 GB స్టోరేజ్‌తో వచ్చేసింది.
Realme 13 Pro 5G – Realme 13 Pro+ 5G ధర రూ. 29,790. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, రియర్ కెమెరా యూనిట్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కాగా ఇది 5050 mAh బ్యాటరీతో వచ్చేసింది.
OPPO F27 Pro 5G – ఈ మెుబైల్ ధర రూ. 29,999. ఈ మెుబైల్ 6.7 FHD+ AMOLED 3D కర్వ్డ్ డిస్ప్లే, 64MP AI ఫీచర్డ్ కెమెరా, IP69, 67W SUPERVOOC, డ్యూయల్ అల్ట్రా క్లియర్ కెమెరా 64MP ప్రధాన కెమెరా + 2MP పోర్ట్రెయిట్ కెమెరా, 8MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో వచ్చేసింది.
Samsung Galaxy A54 5G – Samsung Galaxy A54 5G మెుబైల్ 50MP మెయిన్ కెమెరాతో వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో 6.4 అంగుళాల పూర్తి HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేతో వచ్చేసింది. మైక్రో SD కార్డ్ తో 1 TB వరకూ స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13తో పనిచేసే ఈ మెుబైల్ 5000mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చేసింది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP+12MP+5MP బ్యాక్ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
Realme 12 Pro 5G – ఈ మెుబైల్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఇది 6.7 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 64MP పెరిస్కోప్ + 50MP సోనీ IMX 890 OIS కెమెరా + 8MP, 32MP సెల్ఫీ కెమెరా, 67W సూపర్ VOOC ఛార్జ్‌తో వస్తుంది.
Vivo V40e 5G – Vivo V40e మెుబైల్ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, రిజల్యూషన్ 2400 × 1080 పిక్సెల్, రిఫ్రెష్ రేట్ 120Hzతో వచ్చేసింది. Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే సిస్టమ్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.
ALSO READ : ప్చ్.. ఓటీపీ మోసాలకు చెక్ పెట్టాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనా!