OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు ఓటీటీ వైపే చూస్తున్నారు. ప్రతి శుక్రవారం సరికొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కి వస్తూనే ఉన్నాయి. ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి ఓటీటీ సంస్థలు కూడా తమ వంతు ప్రయత్నాలను చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిందే కథా సుధా వీక్లీ సిరీస్. ఈటీవీ విన్‌లో తెలుగులో వస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్స్ ప్రతి ఆదివారం ఒక్కో స్టోరీతో వస్తున్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందనే వస్తోంది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ స్టోరీలతో ఈ స్టోరీలు మంచి జోరు మీద ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు జెనరేషన్స్‌ల ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ కథ స్ట్రీమింగ్ కి వచ్చింది. దీని పేరు ఏమిటి ? కథ ఏమిటి ? అనే వివారాలను తెలుసుకుందాం పదండి.
ఈ షార్ట్ ఫిల్మ్ పేరు ‘విజయ్ కేరాఫ్ రామారావు’ (Vijay c/o ramarao movie). ఈ సినిమా ట్రైలర్ 2025 అక్టోబర్ 28న రిలీజ్ అయింది. ఓటీటీలోకి ఈ ఆదివారం (నవంబర్ 9) నుంచి తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ ను పలకరిస్తోంది. ఈ సినిమాలో సినియర్ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషించారు. తాత, తల్లి, మనవడు పాత్రలతో ఈ స్టోరీ ఆడియన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతోంది. ‘విజయ్ కేరాఫ్ రామారావు’లో రాశి తల్లిగా, కూతురిగా, భార్యగా యాక్ట్ చేసింది. ఈ మూవీలో రాశితో పాటు శంకర్ మహంతి, మహేంద్ర గణచారి, మేఘన, పీవీఎన్ కార్తికేయ కీలక పాత్రలు పోషించారు. ఉదయ్ కుమార్ సద్దాల నిర్మాతగా వ్యవహరించి నిర్మించిన ఈ సినిమాకు, పీవీఎన్ కార్తికేయ దర్శకత్వం వహించారు.
విజయ్ అనే 80 ఏళ్ల ముసలాయన, తన జీవితాంతం ఎక్కువగా ఒంటరిగానే జీవించాడు. తన ఇష్టాలు, అలవాట్లను మాత్రమే పట్టించుకునేవాడు. ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడే వాడు కాదు. ఇంట్లో తన రూల్స్ మాత్రమే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఒక రోజు కొన్ని కారణాల వల్ల అతని కూతురు, అల్లుడు, మనవడు అతని ఇంట్లోకి వచ్చి ఉండాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ఆశల కథ మొదలవుతుంది. విజయ్ పాత కాలం అలవాట్లు, యంగ్ జనరేషన్ మోడర్న్ లైఫ్‌స్టైల్ మధ్య చిన్న పాటి గొడవలు జరుగుతాయి.
Read Also : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం
విజయ్ తన స్వేచ్ఛను కోల్పోయి ఇంట్లో బందీగా ఫీల్ అవుతాడు. కూతురు, అల్లుడు అతని అలవాట్లతో ఇబ్బంది పడతారు. మనవడు మాత్రం తాతతో బాండింగ్ పెంచుకుంటాడు. ఈ సమయంలో విజయ్ గతం (భార్య మరణం, ఒంటరితనం, కుటుంబం నుంచి దూరమైన కారణాలు) ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తారు. ఇక చిన్న చిన్న గొడవల నుంచి ఈ కుటుంబం ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మనవడు తాతకు మోడర్న్ ప్రపంచం చూపిస్తాడు. విజయ్ మనవడికి జీవిత పాఠాలు చెబుతాడు. చివర్లో ఈ కుటుంబం కలిసి సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా విజయ్ తన ఒంటరితనం నుంచి బయటపడతాడు.