BigTV English

BB Telugu 8 Promo: ఆ విషయంలో తండ్రి వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ..!

BB Telugu 8 Promo: ఆ విషయంలో తండ్రి వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ..!

BB Telugu 8 Promo:విష్ణు ప్రియ(Vishnu Priya).. యాంకర్ గా ‘పోవే పోరా షో’ తో సుధీర్ (Sudheer)తో కలిసి ఆడియన్స్ కు పరిచయమైంది. మొదటి షో తోనే తన వాక్చాతుర్యంతో, చలాకీతనంతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినిమాలలో అవకాశాలందుకొని ఇంకాస్త పాపులారిటీ పెంచుకుంది. దీనికి తోడు బిగ్ బాస్ కంటెస్టెంట్ మానస్ తో కలిసి పలు ఆల్బమ్ సాంగ్స్ చేసి భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగుపెట్టింది. దాదాపు 14 మందితో సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభమైన ఈ సీజన్ 8 ఇప్పుడు 11వ వారానికి చేరుకుంది. టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన విష్ణు ప్రియ ఈవారం నామినేషన్ లో లీస్ట్ లో ఉండడం గమనార్హం.


ఇదిలా ఉండగా ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న విషయం తెలిసిందే. మరో నెల రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 కాస్త పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రోజుకు ఒక కంటెస్టెంట్ కి సంబంధించిన తల్లిదండ్రులు హౌస్ లోకి వస్తూ.. తమ బిడ్డలు టైటిల్ కోసం ఎలా ఆడాలి..? అసలు వారి గురించి బయట ఎలా అనుకుంటున్నారు? అనే విషయాలను చెబుతూ అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని నిన్న యష్మీ తండ్రి రాగా.. నేడు విష్ణు ప్రియ తండ్రి అడుగుపెట్టారు. అందరిలాగా కాకుండా విష్ణుప్రియకి ఇది చాలా పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. ఎందుకంటే విష్ణు ప్రియ తల్లిదండ్రులు ఇద్దరు విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే.తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నా తల్లి కోరిక మేరకు విష్ణు ప్రియ తన తండ్రి దగ్గరకు వెళ్లలేదు. అయితే ఇటీవల కొన్ని నెలల క్రితం విష్ణు ప్రియ తల్లి స్వర్గస్తురాలు అయ్యింది. అయినా సరే తల్లి మరణించినా.. ఆమె కోరిక మేరకు వీరు తమ తండ్రి దగ్గరకు వెళ్ళలేకపోయారు.

అయితే ఇప్పుడు సడన్ గా విష్ణు ప్రియ తండ్రి హౌస్ లో కనిపించేసరికి ఇది ఆమెకు పెద్ద ఎమోషనల్ సిట్యువేషన్ అని చెప్పాలి. తండ్రిని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది విష్ణు ప్రియ. ఈమె తండ్రి కూడా అందరితో ముచ్చటిస్తూ సరదాగా కాసేపు గడిపారు. అలాగే కూతురి కి పృథ్వీ విషయంలో కాస్త చిన్నపాటి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ” పృథ్వీ విషయంలో నీపై చాలా నెగెటివిటీ ఏర్పడుతోంది. అది నువ్వు గమనించు.. ముఖ్యంగా నీ అభిమానులే నిన్ను తిడుతున్నారు” అంటూ విష్ణు ప్రియకి ఆమె తండ్రి తెలిపాడు. అయితే విష్ణుప్రియ..” నాకు అతనిపైన అభిప్రాయం ఏర్పడినప్పుడు.. ఎక్స్ప్రెస్ చేయకుండా ఎలా ఉండాలి నాన్న” అంటూ తెలిపింది. ఇక అక్కడ విష్ణు ప్రియ నిజాయితీకి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మొత్తానికైతే కూతురిలో అటెన్షన్ క్రియేట్ చేశారు విష్ణు ప్రియ తండ్రి.


ఇక అంతే కాదు టేస్టీ తేజ మాట్లాడుతూ.. “తండ్రిగా మీరు బాధ్యతను నిర్వర్తించాలి. పెళ్లి చేయాలి” అని తెలిపాడు.అయితే నోరు జారిన విష్ణు ప్రియ తండ్రి ఇద్దరికీ నచ్చితే పెళ్లి చేస్తాం అన్నట్టు మాట్లాడాడు. కానీ అంతలోనే ఇది గేమ్ వరకు మాత్రమే.. ఆ తర్వాత ఆమెకు నచ్చిన వాడు దొరకాలి కదా.. అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతోంది.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×