BigTV English

Bigg Boss 8 Elimination: బిగ్ బాస్ లో మరో లేడీ కంటెస్టెంట్ బలి.. ఊహించిన వారే ఎలిమినేట్..?

Bigg Boss 8 Elimination: బిగ్ బాస్ లో మరో లేడీ కంటెస్టెంట్ బలి.. ఊహించిన వారే ఎలిమినేట్..?

Bigg Boss 8 Elimination:తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ రియాల్టీ షో కోసం ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. దాదాపు 14 మందితో ప్రారంభమయ్యే ఈ షో అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా.. టైం ఎంత అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ముక్కు మొహం తెలియని వ్యక్తులతో దాదాపు 104 రోజులు గడపాల్సి ఉంటుంది. ఈ రోజుల సంఖ్య ఒక్కో షో ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు దిగ్విజయంగా పూర్తి అవ్వగా ఎనిమిదవ సీజన్ 9వ వారానికి చేరుకుంది.


మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనికి తోడు వైల్డ్ కార్డు ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఎనిమిది మందిని హౌస్ లోకి తీసుకురావడంతో షో మరింత రక్తి కట్టించింది అని చెప్పవచ్చు. మొదటి వారంలో భాగంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా.. ఆ తర్వాత వారాలలో శేఖర్ బాషా , అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, సీత, మణికంఠ, మెహబూబ్ ఇలా 8 వారాలకు గానూ మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక తొమ్మిదవ వారం నామినేషన్స్ లో భాగంగా ఐదు మంది నామినేషన్స్లోకి వచ్చారు.

హరితేజ, నయనీ పావని, గౌతమ్, టేస్టీ తేజ, యష్మీ గౌడ ఇలా మొత్తం ఐదు మంది నామినేషన్స్ లోకి రాగా.. ముగిసిన ఓటింగ్ ప్రక్రియ ప్రకారం నయనీ పావని ఈ వారం ఎలిమినేట్ అయినట్లు వార్తలు అనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్టార్ మా బిగ్ బాస్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఓటింగ్ బట్టి చూస్తే లీస్ట్ లో ఉన్నది హరితేజ, నయని పావని. కానీ నిన్న జరిగిన లాస్ట్ ఓటింగ్ లో నయని పావని డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈమె ఎలిమినేట్ అయినట్లు తెలిసింది.


ఇకపోతే నయని పావని పొట్టిగా ఉన్నప్పటికీ తనదైన ఆట తీరుతో మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తనలోని కసిని చూపించి ఎలాగైనా టైటిల్ గెలవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసుకోలేకపోయింది. ఇకపోతే సీజన్ సెవెన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన నయని పావని మొదటి వారమే ఎలిమినేట్ అవ్వడంతో అందరూ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈసారి కూడా వైల్డ్ కార్డు ద్వారానే ఎంట్రీ ఇచ్చింది నయని పావని. కానీ 3 వారాలకే ఎలిమినేట్ అవ్వడంతో ఊహించిన వారే ఎలిమినేట్ అయ్యారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నయని పావనితో పోల్చుకుంటే మిగతా నలుగురు కంటెస్టెంట్స్ కూడా స్ట్రాంగ్ గా ఆడడమే కాకుండా మంచి పిఆర్ టీమ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. దీనికి తోడు ఆడియన్స్ లో మంచి పాపులారిటీ కూడా ఉంది.

Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×