BigTV English

MP Dharmapuri : కులగణన సర్వేకు బీజేపీ మద్ధతు.. ఎంపీ ధర్మపురి ఆసక్తికర కామెంట్స్

MP Dharmapuri : కులగణన సర్వేకు బీజేపీ మద్ధతు.. ఎంపీ ధర్మపురి ఆసక్తికర కామెంట్స్

MP Dharmapuri :  తెలంగాణాలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా సత్తా చాటతామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ధర్మపురి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై విమర్శలు చేశారు. తొమ్మిదేళ్లు తెలంగాణాను పరిపాలించిన బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని అధోగతి పాలుజేసిందన్న అరవింద్.. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.


రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన ధర్మపురి అరవింద్.. అసలు తెలంగాణను నాశనం చేసిందే కేటీఆర్ అని మండిపడ్డారు. షాడో ముఖ్యమంత్రిలా అన్ని విషయాల్లో జోక్యం చేసుకున్న కేటీఆర్.. పరిపాలనను గాడి తప్పించారని ఆరోపించారు. పాదయాత్ర పేరుతో ప్రజల ముందుకు వెళితే జనం తీవ్రంగా వ్యతిరేకిస్తారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఎంపీ ధర్మపురి… రాష్ట్రం మొత్తం పాకులాడినా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడవని తేల్చేశారు. తొమ్మిదేళ్ల పాటు నియంతలా పరిపాలించి.. ఇప్పుడు పాదయాత్రలు అనడమేంటని ప్రశ్నించారు.

కులగణనకు మద్ధతు 


బీఆర్ఎస్ పార్టీ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతుందని విమర్శించిన ధర్మపురి అరవింద్.. కొత్తగా కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులేంటని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని దిగదర్చారని మీకు అధికారం అప్పగిస్తే.. మీరు అంతకంటే ఘోరంగా పనిచేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మొదలుపెట్టిన కులగణనకు మద్ధతు ప్రకటించిన ఎంపీ ధర్మపురి అరవింద్.. కుల గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టనున్న సర్వేలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తిచేయాలని, బీజేపీ సైతం ఈ సర్వేకు అండగా నిలుస్తుందని ప్రకటించారు.

తెలంగాణలో హిందూ రాజ్య స్థాపన జరగాలి.
రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరిపాలన సాగుతుందని.. రానున్న రోజుల్లో ఇక్కడ హిందూ రాజ్య స్థాపన జరగాలని అన్నారు. ఇప్పటికే.. తమ కేడర్ పూర్తిస్థాయిలో పనిచేస్తుందన్న ఎంపీ ధర్మపురి అరవింద్.. తెలంగాణలో ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా బీజేపీ తడాకా చూపిస్తదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పార్టీ సభ్యత్వ సమోదు విజయవంతంగా జరుగుతుందన్న ఎంపీ.. కోరుట్ల మాదిరిగా జగిత్యాల లోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×