BB Telugu 8 Promo:తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకోనుంది. ఈ క్రమంలోనే టికెట్ టు ఫినాలే రేస్ రసవత్తరంగా సాగుతోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా టికెట్ టు ఫినాలేకి ఎంపిక అవ్వడానికి కంటెస్టెంట్స్ ఏ రేంజ్ లో పోటీ పడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇకపోతే ఇప్పటివరకు ఆడిన ఛాలెంజ్లలో నిఖిల్, అవినాష్, టేస్టీ తేజ, రోహిణి బరిలోకి దిగగా.. చివరి ఆటతో ఈరోజు టికెట్ టు ఫినాలే కి ఎవరు వెళ్లబోతున్నారు అనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. తాజాగా 89వ రోజుకు సంబంధించిన రెండవ ప్రోమో ని విడుదల చేయగా.. అందులో టికెట్ టు ఫినాలే కి ఎవరు అర్హులో గెస్ట్ గా వచ్చిన యాంకర్ కం మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీముఖి వెల్లడించింది.
తాజాగా ప్రోమో మొదలవగా.. శ్రీముఖి ఏదైనా మనసులో ఉన్నప్పుడు బయటకు చెప్పేయాలి.. అప్పుడే ఇతరులకు అర్థమవుతుంది అంటూ చెబుతూ.. ఎస్పెషల్లీ నువ్వు అంటూ విష్ణు ప్రియని అడిగింది శ్రీముఖి. దాంతో విష్ణు ప్రియ మాట్లాడుతూ.. జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పగా నాకు కూడా అలాగే చెబితే కొడతాను నేను అంటూ కామెడీ చేసింది శ్రీముఖి. ఇక తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ..”టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి, మొదటి ఫైనలిస్ట్ అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ గుర్తుపట్టు గంటకొట్టు. అంటూ టాస్క్ నిర్వహించారు. ఇకపోతే ఇప్పటివరకు ఛాలెంజ్లలో గెలిచిన రోహిణి, టేస్టీ తేజ, అవినాష్, నిఖిల్ పోటీ పడగా.. మొదట గంటను నిఖిల్ అందుకున్నారు. ఇకపోతే అక్కడున్న బొమ్మను గుర్తుపట్టడంలో నబీల్ హెల్ప్ చేసినట్లు మిగతా కంటెస్టెంట్స్ చెప్పారు. కానీ దానిని ఒక పాయింట్ గానే పరిగణించారు శ్రీముఖి.
ఆ తర్వాత టాస్క్ మొదలవగా రోహిణి గంట అందుకుంది. ఆ తర్వాత నిఖిల్ అలా ఒకరి తర్వాత ఒకరు గంట కొట్టి టాస్క్ గెలిచే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే నిఖిల్ కు నాలుగు పాయింట్లు రాగా , అవినాష్ కి రెండు పాయింట్లు వచ్చాయి. అటు రోహిణి, టేస్టీ తేజకు చెరొక పాయింట్ లభించింది. “రెండే రెండు పిక్చర్స్. ఎవరైతే లాస్ట్ లో ఉంటారో వారు ఈ రేస్ నుంచి బయటకు వెళ్తారు” అంటూ తెలిపింది శ్రీముఖి. ఇక లీడ్ లో ఉన్నాము నేను వెళ్తాను అంటూ రోహిణి అవినాష్ కి చెప్పగా, కానీ అవినాష్ వెళ్లి గంట తీసుకున్నారు. అవినాష్ తర్వాత రోహిణి వెళ్ళింది. రోహిణి తర్వాత టేస్టీ తేజ వెళ్లారు. కానీ ఇక్కడ ఆ ఒక్క పాయింట్ కోసం వీరంతా గొడవ పడినట్లు తెలుస్తోంది. ఇక రోహిణి మాట్లాడుతూ ప్రతి పాయింట్ కూడా ఇక్కడ అవసరమే కదా.. లీస్టులో ఉన్నది మేమిద్దరమే అంటూ తెలిపింది. బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ రేస్ లో ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయో చెప్పమని తెలపగా.. నిఖిల్ టికెట్ టు ఫినాలే రేస్ గెలిచి మొదటి ఫైనలిస్ట్ అయినట్లు సమాచారం.