Ariyana: అరియానా(Ariyana) పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయిన ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో అవకాశం అందుకున్నారు. ఇలా రెండుసార్లు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న అరియానా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో వెబ్ సిరీస్లలో నటిస్తూ మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ బిజీగా ఉన్నారు.
సొంత ఇంటి కల..
ఇక నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా ఒక ఆసక్తికరమైన వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా తన సొంత ఇంటి (Own House)కల నెరవేరబోతుందని తెలియజేశారు. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల అని చెప్పాలి. ఇందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక అరియాన కూడా హైదరాబాదులో తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోబోతున్నట్టు తెలియచేశారు. ఈ వీడియోలో భాగంగా తన ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి తెలియజేశారు.
నిర్మాణ దశలో అరియానా ఇల్లు..
ప్రస్తుతం అరియానా తన సొంత ఇల్లు నిర్మాణ దశలో ఉందని అతి త్వరలోనే పూర్తి కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్లిన ఈమె వీడియో కూడా తీస్తూ తన ఇంట్లో కిచెన్, బెడ్ రూమ్, హాల్ గురించి తెలియజేశారు. ఇక తన సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నట్లు కూడా తెలియజేశారు. సొంత ఇల్లు ఉంది అనే సంతోషం కంటే కూడా సంవత్సరాలు తరబడి ఈఎంఐ కట్టాలనే భయమే ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక అక్కడ పనిచేస్తున్న వారితో కలిసి కూడా ఈమె పనులు చేస్తూ కనిపించారు. మొత్తానికి అరియాన తొందరలోనే తన ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసి సొంత ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తన ఇంటికి సంబంధించిన వీడియోని ఈమె షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంటి నిర్మాణం దాదాపు 60% పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు ముందుగానే ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అరియాన వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే యాంకర్ గా కూడా పలు ఈవెంట్లు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తో ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా పెద్ద ఎత్తున ఫేమస్ అవ్వడమే కాకుండా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: Miheeka: ప్రెగ్నెన్సీ వార్తల పై స్పందించిన మిహీక.. ఫుల్ క్లారిటీ ఇచ్చిందిగా?