BigTV English

Tollywood Movies : థియేటర్‌లో మూడు గంటలు ఉండాల్సిందే… నరకం చూపించిన సినిమాలు ఇవే..

Tollywood Movies : థియేటర్‌లో మూడు గంటలు ఉండాల్సిందే… నరకం చూపించిన సినిమాలు ఇవే..
Advertisement

Tollywood Movies : టాలీవుడ్ సినిమాలకు కథ డిమాండ్ చేస్తే టైం కూడా పెరుగుతుంది. సాదారణంగా 2 గంటలు పైన ఉండాల్సిన సినిమాలు 3 గంటలకు పైనే ఉంటాయి. మూడు గంటలు పై ప్రేక్షకులు సినిమాను వీక్షించడం అంటే పెద్ద పరీక్షే అని చెప్పాలి. ఎంత కథ బాగున్నా ఎక్కువగా సమయం సినిమాను చూడలేరు. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో 3 గంటలకు పైగా నిడివి గల సినిమాలు వచ్చాయి. నిజానికి అనుకున్న కథను ఆద్యంతం ఆసక్తిగా మలిచి చివరి వరకు ప్రేక్షకుడిని సీట్లో కూర్చోబెడితే ఆ దర్శకుడు విజయవంతం అయినట్లే. సినిమా నిడివి ఎంత ఉన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చెప్పాల్సిన అంశాన్ని సాగదీయకుండా ఉంటే సక్సెస్ సాధించినట్లే. ఈ క్రమంలో కొన్నిసార్లు నిడివి కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఆ సినిమాలు అన్ని మంచి హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


పాతాళ భైరవి..

1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజము. యన్.టి.ఆర్ యుక్తవయస్సు, ప్రతిభ, నేపాళ మాంత్రికునిగా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము, కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు దీనిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకొన్న సినిమా ఇది. తమిళంలో కూడా విడుదలైంది.


లవ కుశ..

1963లో వచ్చిన ఈ సినిమా నిడివి 3గంటల 28 నిమిషాలు. స్వర్గీయ నటుడు సీనియర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు..

పాండవ వనవాసం..

ఈ సినిమా నిడివి 3గంటల 18 నిమిషాలు. 1965లో వచ్చిన ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ నటించారు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది..

దాన వీర సూర కర్ణ..

1977లో వచ్చిన ఈ సినిమా మొత్తం 3గంటల 33 నిమిషాలు ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో అత్యధిక నిడివి ఉన్న చిత్రం బహుశా ఇదే కావచ్చు. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాను అప్పట్లో 11 లక్షల రూపాయలతో తెరకెక్కించగా.. దాదాపు రూ.2కోట్లు వసూలు చేసింది.

మాయా బజార్.. 

1957లో వచ్చిన మాయాబజార్ సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు. ఈ సినిమాలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు జంటగా నటించారు.

నువ్వునాకు నచ్చావ్.. 

2001లో వేంకటేష్, ఆర్తి ఆగర్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా నిడివి 3గంటల 4 నిమిషాలు. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

అర్జున్ రెడ్డి..

2017లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమా నిడివి 3 గంటల 2 రెండు నిమిషాలు.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా రూపురేకలనే మార్చేసింది.

RRR.. 

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం RRR. ఈ సినిమా నిడివి 3 గంటల 7 నిమిషాలు.. ఆస్కార్ అవార్డు ను కూడా అందుకుంది.

పుష్ప 2.. 

ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ నిడివి 3 గంటల 20 నిమిషాలు. 3 గంటల పైన ఉన్న సినిమాలు మంచి టాక్ అందుకుందున్నాయి.. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Big Stories

×