Aadi Reddy: ఒక సాధారణ వ్యక్తిగా, సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ.. యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) ద్వారా సెలబ్రేటీ హోదా అందుకున్న వారిలో బిగ్ బాస్ ఆదిరెడ్డి(Aadi Reddy) ఒకరు. ఈయన బిగ్ బాస్ రివ్యూ(Bigg Boss Reviews) ఇస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా, బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకొని టాప్ 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆదిరెడ్డి ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈయనకు, తన భార్య కవితకు(Kavitha) సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
మరోసారి ఆడబిడ్డకు జన్మ..
ఇదిలా ఉండగా తాజాగా ఆదిరెడ్డి వైఫ్ కవిత రెండోసారి పండంటి ఆడబిడ్డకు(Baby Girl) జన్మనిచ్చారు. ఈయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు రెండోసారి అమ్మాయి పుట్టింది అంటూ అభిమానులతో శుభవార్తను పంచుకున్నారు. అయితే పాప జన్మించిన సమయంలో ఆదిరెడ్డి తన కుమార్తె ఫేస్ అభిమానులకు చూపించడానికి ఇష్టపడలేదు. ఇక తాజాగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో తన అమ్మ తన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది అంటూ ఈయన మరొక వీడియోని కూడా విడుదల చేశారు. అదేవిధంగా తన కుమార్తె ఫోటోని కూడా షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ రివ్యూ యర్ గా గుర్తింపు…
ఈ విధంగా ఆదిరెడ్డి తన రెండో బిడ్డను అందరికీ పరిచయం చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పాప చాలా ముద్దుగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మరి కొంతమంది పాప కాకుండా బాబు పుట్టి ఉంటే బాగుండేది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అయితే ఇదివరకే ఆదిరెడ్డికి ఒక కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆదిరెడ్డి రెండో కుమార్తెకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదో జీవనాధారం కోసం యూట్యూబ్ ద్వారా బిగ్ బాస్ రివ్యూలు ఇస్తున్న ఆదిరెడ్డికి అదే జీవితంగా మారిపోయిందని చెప్పాలి. ఇలా బిగ్ బాస్ రివ్యూ ఇస్తూ నెలకు లక్షల్లో ఈయన ఆదాయం అందుకుంటున్నారు. స్వయంగా ఆదిరెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి పూర్తి అయ్యేవరకు తనకు నెలకు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు.
సెలూన్ ప్రారంభించిన ఆదిరెడ్డి…
ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకుంటున్న ఈయన పలు వ్యాపారాలను కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల వైజాగ్ లో ఈయన సెలూన్ షాప్ ప్రారంభించారు. ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఆదిరెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం సెలబ్రెటీ హోదా అనుభవిస్తున్నారు. ఇక ఈయన భార్య కవిత కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన వీడియోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఈమె కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.
Also Read: Ranveer Singh: అభిమాని కాళ్లు మొక్కిన స్టార్ హీరో.. సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే!