E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!
Advertisement

Bigg Boss 9 Telugu: ఏడాది ఆగస్టు 3 న ఫ్రెండ్షిప్ డే(Friend Ship Day) జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వారి మిత్రులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకోవడమే కాకుండా వారికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమానికి సంబంధించి ఒక స్పెషల్ వీడియోని స్టార్ మా విడుదల చేసింది. తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం ఇప్పటికే 8 సీజన్లను పూర్తిచేసుకుని తొమ్మిదవ సీజన్లోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా బిగ్ బాస్ తెలుగు అన్ని సీజన్లోకి సంబంధించిన ఒక వీడియోని విడుదల చేశారు.

స్నేహం ఎప్పటికీ నిలిచిపోతుంది..

Advertisement

ఈ వీడియోలో భాగంగా మొదటి సీజన్ హోస్ట్ గా  ఎన్టీఆర్(Jr.NTR) వ్యవహరించినప్పటినుంచి ఇప్పటివరకు కంటెస్టెంట్లతో దిగిన ఫోటోలను వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోని షేర్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో గొడవలు ముగిసిపోతాయి, పనులు కూడా పూర్తి అవుతాయి కానీ బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడిన స్నేహం మాత్రం ఎప్పటికీ అలాగే నిలిచిపోతాయి. ప్రతి ఆటను అధిగమించే బంధానికి చీర్స్ అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హోస్ట్ గా నాగార్జున…

Advertisement

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని (Nani)హోస్ట్ గా వ్యవహరించారు. ఇక తదుపరి సీజన్లో నుంచి ఇప్పటివరకు నాగార్జున(Nagarjuna) ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎనిమిదవ సీజన్ పూర్తి కావడంతో తొమ్మిదవ సీజన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇకపోతే ఈ కార్యక్రమంలో ఈసారి కామన్ మ్యాన్ ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కామన్ మ్యాన్ క్యాటగిరిలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపికలో భాగంగా వేల మందిని సెలెక్ట్ చేశారని వారిలో మరి కొంతమందిని ఫైనల్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ 9 కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలను చూస్తుంటే మాత్రం ఈసారి ఈ సీజన్ చాలా విభిన్నంగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. విజయం సాధించాలి అంటే యుద్ధం చేయాల్సిందేనని ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పే మాటలు ఈ కార్యక్రమం పై మంచి అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయినట్టు సమాచారం. ఇక ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ప్రతిరోజు ఒక లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఫైనల్ గా ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొనబోతున్నారు అనేది తెలియాలి అంటే సీజన్ ప్రారంభం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.

Also Read: Mrunal Thakur: వామ్మో మృణాల్ ధరించిన ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

 

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×