BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu : హోస్ట్ నాగర్జున పైనే చిరాకు పడుతున్న యష్మీ.. అసలు ఏమైందంటే..?

Bigg Boss 8 Telugu : హోస్ట్ నాగర్జున పైనే చిరాకు పడుతున్న యష్మీ.. అసలు ఏమైందంటే..?

Bigg Boss 8 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో వీకెండ్ ఎపిసోడ్స్ ఈ మధ్య ఆడియన్స్ కి కూడా అర్థం కానట్టుగా మారుతున్నాయి. శనివారం రోజు నాగార్జున (Nagarjuna ) ఇంతకుముందు వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ కడిగిపారేశారు. కానీ ఈ శనివారం మాత్రం ఒకటి రెండు విషయాలలో తప్పా.. చాలా కూల్ గానే ప్రవర్తించాడు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ యొక్క రహస్యాలను బయటకి తీస్తూ ఆడియన్స్‌కి తెలియజేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ విషయంలో నెటిజెన్స్ మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.


నాగ్‌పై యష్మీ చిరాకు… 

ఎందుకంటే కంటెస్టెంట్స్ యొక్క వ్యక్తిగత విషయాలను బయటకు లాగి వారి పరువు బయట పెట్టడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది నాగార్జున హోస్టింగ్ ఈ సీజన్లో చాలా చెత్తగా ఉందని, షో డిజాస్టర్ అవ్వడానికి నాగార్జున హోస్టింగ్ కూడా ఒక కారణమని చెబుతున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ చేసిన తప్పులు ఎన్నో ఉన్నాయి. ఆ తప్పులను సరైన పద్ధతిలో అడ్రస్ చేసి హౌస్మేట్స్ ని నాగార్జున సరి చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అసంపూర్ణంగానే శనివారం ఎపిసోడ్ని ముగించారు. దీనికి తోడు ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున మీద యష్మీ చిరాకు పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.


అసలేం అయిందంటే..? 

అసలు విషయంలోకి వెళ్తే.. గౌతమ్ ని అన్యాయంగా ఈమె టార్గెట్ చేసి గేమ్ నుండి తొలగించిన విషయం అందరికీ తెలుసు. గౌతమ్ బాగా ఆడినప్పటికీ కూడా తన అక్కసు మొత్తం గౌతమ్ పై చూపించింది. గేమ్ ఆడలేదని హౌస్ మేట్స్ అందరికీ చెప్పి అతడిపై బురదజల్లే ప్రయత్నం చేసింది. దీనికి తోడు మెగా చీఫ్ టాస్క్ లో టీం మొత్తం ఓడిపోయినా.. గౌతమ్ కారణంగానే ఓడిపోయామని పోర్ట్రైట్ చేసింది. మరోవైపు ఈమెతో క్లోజ్‌గా ఉంటున్న నిఖిల్.. ఎల్లో కార్డు మీ టీం కి ఇస్తాము.. నువ్వు గౌతమ్ ని తీసేయాలి అని యష్మీ ను రూమ్ లోపలికి తీసుకెళ్లి మరీ మ్యానుపులేట్ చేసే ప్రయత్నం చేశారు. కెమెరాల ముందేమో యష్మి నేను గౌతమ్ ని తీయలేను అని నిఖిల్ తో చెబుతూ డ్రామాలు కూడా చేసింది. కానీ చివరికి గౌతమ్ ను టీం నుండి తప్పించింది.

ఇదంతా కాస్త పక్కన పెడితే.. నాగార్జున హౌస్మెట్స్ అందర్నీ యాక్షన్ రూమ్ కి పిలిపించి, ఎనిమిది రకాల రుచులు ఉన్న జ్యూస్ లను కలిపి ఎవరో ఒక కంటెస్టెంట్ కి ఇవ్వండి అని చెబుతాడు. దీంతో హరితేజ నిఖిల్ కి చిల్లి, ఆమ్లా జ్యూస్ ని కలిపి.. గౌతమ్ విషయంలో నిఖిల్ యష్మి నీ మ్యానుపులేట్ చేశాడు అని చెప్పి జ్యూస్ ఇస్తుంది. అప్పుడు నాగార్జున కూడా.. నాకు కూడా అనిపించింది. యష్మీ ని నిఖిల్ మ్యానుపులేట్ చేశాడని అని అంటాడు. దాంతో “దేవుడు సాక్షిగా లేదు సార్” అని నిఖిల్ చెబితే, వెంటనే యష్మి కూడా.. “అయ్యో లేదు సార్.. దయచేసి మీరు అలా చెప్పకండి” అంటూ చెప్పగా.. ఏమో పృథ్వీ కూడా అదే చెప్పాడు అని నాగార్జున అన్నాడు. దీంతో కాస్త చికాకుగా..” ఏంట్రా నిజమా..?” అంటూ పృథ్వీ ను అడిగింది. “నేనేం చెప్పలేదు రా బాబు.. నన్ను వదిలేయ్” అంటూ పృథ్వి అన్నాడు. మొత్తానికైతే నిజాలు చెబితే ఈమె హోస్ట్ పైనే చిరాకు పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×