E-Paper
Advertisement

Bigg Boss Vishnu Priya : నిజమా .. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా విష్ణు ప్రియా.. కానీ ఒక ట్విస్ట్..

Bigg Boss Vishnu Priya : నిజమా .. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా విష్ణు ప్రియా.. కానీ ఒక ట్విస్ట్..
Advertisement

Bigg Boss Vishnu Priya : ఇప్పుడు సెలెబ్రేటీలుగా ఉన్న వాళ్లలో కొందరు చిన్నప్పుడు సినిమాల్లో నటించారన్న విషయం తెలిసిందే.. ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ సినిమాల్లో కనిపించి మెప్పించారు. అయితే హీరో, హీరోయిన్లు మాత్రమే కాదు యాంకర్లు కూడా పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనే డౌట్ వస్తుంది కదా.. అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం బిగ్ బాస్ లో టాప్ లో కొనసాగుతున్న హాట్ బ్యూటీ విష్ణు ప్రియా ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా చేసిందని చాలా మందికి తెలియదు.. ఏంటి విష్ణు ప్రియ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాలో నటించిందా? ఏ సినిమాలో అని అనుకుంటున్నారు కదూ.. ఆ మూవీ ఏంటో, ఎప్పుడు నటించిందో కాస్త వివరంగా తెలుసుకుందాం…

ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమాలల్లో యమ దొంగ కూడా ఒకటి. ఈ సినిమా ఎన్టీఆర్ లైఫ్‌లో మర్చిపోలేని విజయాన్ని అందించింది. అందుకే ఈ మూవీ నందమూరి ఫ్యాన్స్ కూడా చాలా స్పెషల్. ఆ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచే దొంగగా కనిపిస్తాడు. దొంగతనం చేస్తుంటే చిన్నప్పటి ప్రియమణి అతన్ని కాపాడుతుంది. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల విడిపోయి మళ్లీ కలుసుకుంటారు. అయితే ఆ చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో నటించిన పాప మరెవ్వరో కాదు.. మన విష్ణు ప్రియానే.. ఏంటి నమ్మలేకున్నారు కదా.. అయిన ఇదే నిజం.. విష్ణు ప్రియా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన మొదటి సినిమా ఇదే.. ఆ తర్వాత మనకు యాంకర్ గా పరిచయం అయ్యింది. యమదొంగ లోని చిన్నప్పటి హీరో, హీరోయిన్ల వీడియో బిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ఒక్కో సినిమాతో తన హిట్ ట్రాక్ ను పెంచుకుంటూ వస్తున్నాడు. వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. విదేశాల్లో కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇక ఆ సినిమా తర్వాతే సోలో హీరోగా దేవర సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ ను అందుకున్న కూడా కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టింది. దాంతో హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు.

ఇక విష్ణు ప్రియా విషయానికొస్తే.. యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. పలు షోలు చేసింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా నటించింది. ఇక ఇప్పుడు తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ గా కొనసాగుతుంది. హౌస్ లో తన మాట, పాటలతో ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటుంది. మరి విన్నర్ అవుతుందేమో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×