Bigg Boss Buzz: బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎలిమినేట్ అయిపోయిన హౌస్ మేట్స్ అందరూ కూడా శివాజీ హోస్ట్ గా చేసే బిగ్ బాస్ బజ్ కు హాజరయ్యే విషయం తెలిసిందే. అయితే ఈ వారం భరణి ఎలిమినేట్ అయిపోయారు దానికి సంబంధించిన ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.
నాగార్జున ఏవైతే కొన్ని వారాల క్రితం భరణికి మాటలు చెప్పారో, అవే మాటలను శివాజీ మరోసారి గుర్తు చేశారు. ఈ ప్రోమో కూడా ఆసక్తికరంగా ఉంది. కంప్లీట్ ఇంటర్వ్యూ చూడాలి అనిపించేలా ఆసక్తిని కలిగించింది.
ప్రోమో స్టార్ట్ అవడంతోనే శివాజీ బ్యాటింగ్ మొదలుపెట్టారు. బిగ్ బాస్ హౌస్ కి ఆట ఆడుదాం అని వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళగానే ఇంటింటా రామాయణం సీరియల్ మొదలుపెట్టాడు అంటూ ఇంట్రడక్షన్ ఇచ్చాడు.
ఎంట్రీ ఇవ్వగానే ఒక స్వీట్ ఇచ్చారు, ఎలా ఉంది అని అడగ్గాని బాగుంది అని చెప్పారు భరణి. వెంటనే మరికొన్ని స్వీట్స్ ఇచ్చి కూతురు తనుజ, చెల్లి దివ్య, తమ్ముడు రాము రాథోడ్ ను గుర్తు చేశారు. మరోసారి బాగా పాపులర్ అయిన కుటుంబం అన్నగారి కుటుంబం అనే పాటను గుర్తు చేసి మరి రోస్ట్ చేశాడు శివాజీ.
మీరు గేమ్ ఆడాను అని అనుకుంటున్నారు కానీ మీరు గేమ్ ఆడలేదు. బాండింగ్స్ లో మీరు ఇరుక్కుపోయారు. ఈ కలుపుకోవడానికి మనకు అవసరమా అని శివాజీ ప్రశ్నించారు.
శివాజీ అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన సమాధానం చెప్పాడు భరణి. నేను ఎవరిని కలుపుకోలేదు అని క్లారిటీ ఇచ్చాడు. అలానే తనుజ దివ్య వలన నా గేమ్ పోయింది అని కూడా నేను అనుకోలేదు. వాళ్ల దగ్గర కూడా నేను ఆగిపోలేదు అని చెప్పాడు.
దానికి కౌంటర్ గా శివాజీ మాట్లాడుతూ మీరు అక్కడ ఆగిపోకపోతే ఈరోజు మీరు బయటకు రారు అని బల్లగుద్ది నట్లు చెప్పారు. పవర్ ఆస్త్రాను మీకు ఇమ్మానుయేల్ ఎందుకు వాడలేదు అనే ప్రశ్నను కూడా అడిగారు. అది ఇమ్మానుయేల్ గేమ్ ప్లాన్ అని భరణి చెప్పాడు. ఈ ఆన్సర్ తో భరణికి కూడా ఇమ్మానుయేల్ తీరు పైన ఒక క్లారిటీ వచ్చింది అని అర్థమవుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఎపిసోడ్ త్వరలో విడుదల కానుంది.
Also Read: Emmanuel: నమ్మించి మోసం చేసిన ఇమ్మానుయేల్, నెగెటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం