Bigg Boss 9 promo : బిగ్ బాస్ సీజన్ 9, 6 వారాలు పూర్తయింది. సక్సెస్ ఫుల్ గా 7వ వారంలోకి కంటెస్టెంట్ లందరూ అడుగుపెడుతున్నారు. అయితే ప్రతివారం ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవడం తప్పదు. పోయిన వారం మాత్రం ఎవరు ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీజ దమ్ము బయటకు వెళ్లిపోవడం అన్నది చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
శ్రీజ దమ్ము ఎలిమినేట్ అని చెప్పినప్పుడు పెద్దగా ఎవరికి నమ్మశక్యంగా అనిపించలేదు. శ్రీజ కి న్యాయం జరగాలి అని కొంతమంది ట్వీట్లు కూడా వేశారు. మొత్తానికి శివాజీ తో బిగ్ బాస్ బజ్ కూడా అయిపోయింది. శ్రీజ మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఇక ఈ వారం భరణి నామినేషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లే. వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చిన తర్వాత అప్పటికే హౌస్ లో ఉన్న వాళ్లను ఎలిమినేట్ చేసే అవకాశం వీళ్లకు దక్కింది. దీనిలో భాగంగా చాలామంది నామినేషన్ కి వెళ్లిపోయారు. వారిలో అందరూ సేఫ్ అయిపోయి చివరికి భరణి మరియు రాము రాథోడ్ మిగిలారు.
భరణి హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అందరితో కూడా చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఆరువారాలు హౌస్ లో ఉన్నారు. తాను రిస్కులో పడిపోతాడు అని ఎవరు ఊహించలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా జరగడమే కదా బిగ్ బాస్ అసలు ఉద్దేశం.
మొత్తానికి ఆడియన్స్ వేసిన ఓటింగ్స్ లో బాటమ్ లో ఉన్నది ఇద్దరు వ్యక్తులు. ఒకటి రాము రాథోడ్ మరియు భరణి. అయితే ఇమ్యూనిటీ పవర్ ఇమ్మానుయేల్ దగ్గర ఉంది. దానిని ఉపయోగించి వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేయొచ్చు. కానీ ఇమ్మానుయేల్ ఆ పవర్ ఎవరికి యూస్ చేశాడు తెలియదు.
కానీ భరణి ఎలిమినేషన్ ఆల్మోస్ట్ ఫిక్సయిపోయింది బయటకు కూడా వచ్చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. దీనిని బట్టి చూస్తే పవరస్త్రాను రాము రాథోడ్ కోసం ఇమ్మానుయేల్ ఉపయోగించాడా అనేది చాలామందికి వస్తున్న సందేహం.
ఒకవేళ పవర్ అస్త్ర భరణి కోసం ఇమ్మానుయేల్ ఉపయోగించిన కూడా, ఆడియన్స్ ఓటింగ్ చాలా తక్కువగా ఉండటం వలన భరణి బయటకు రావలసిన పరిస్థితి వచ్చి ఉండవచ్చు. ఏదేమైనా ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో దీని గురించి క్లారిటీ రానుంది.
Also Read: Bigg Boss 9 : ఏం మేనేజ్మెంట్ రా బాబు? ఇన్స్టాలో బూతులు మాట్లాడే దాన్ని తీసుకొచ్చి దుబాయ్ అంటారు