Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 నేటితో దాదాపు 7 వారాలు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయిన కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆరుగురు లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఇక నేటితో భరణి బయటకు వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఈ రోజు టెలికాస్ట్ కానుంది.
బిగ్ బాస్ ను చాలామంది ఆదరించి చూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ షో మీద విపరీతమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. ప్రతి వారం నాగర్జునతో పాటు కొంతమంది ఆడియన్స్ ఈ షోలో పాల్గొంటారు. కంటిస్టెంట్లు పైన ఉన్న అభిప్రాయాన్ని వీళ్ళు తెలియజేయడం కూడా జరుగుతుంది. అయితే ప్రతి వారం కూడా ఒక్కో కంట్రీ నుంచి ఒక్కొక్కరు వచ్చి బిగ్ బాస్ పైన ఆదరణ చూపిస్తున్నట్లు ఆ షోలో చూపిస్తున్నారు. దానిపైనే విపరీతమైన ట్రోలింగ్ వస్తుంది.
నిన్న జరిగిన ఎపిసోడ్ చాలామంది చూసే ఉంటారు. ఆ ఎపిసోడ్ లో ఒక ఆడియన్ మాట్లాడుతూ మేము దుబాయ్ నుంచి వచ్చాము. కేవలం మిమ్మల్ని చూడడం కోసమే వచ్చాము అని నాగర్జున ఉద్దేశిస్తూ ఒక ఆడియన్ మాట్లాడారు. ఆ తర్వాత మా అమ్మగారు మీకు చాలా పెద్ద అభిమాని ఆవిడకి ఒకసారి హాయ్ చెప్పండి అంటూ కూడా ఆవిడ మాట్లాడింది.
అయితే ఆవిడ దుబాయ్ నుంచి వచ్చారు అన్నది మాత్రం పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆవిడ ఇంస్టాగ్రామ్ ఐడి స్వాగ్ గర్ల్ అని అప్పట్లో ఉండేది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీంకు ఆమె వీరాభిమాని. అయితే ఆ టీమును పొగిడే సందర్భంలో ధోనీ పైన కూడా విపరీతమైన కామెంట్స్ చేస్తూ ఉండేది.
కేవలం కామెంట్స్ చేయటం మాత్రమే కాకుండా అర్థం పర్థం లేని బూతులు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎపిసోడ్ చూసిన వెంటనే ఆ ఎపిసోడ్ తో పాటు గతంలో ఆమె చేసిన కొన్ని రీల్స్ నెటిజెన్లు ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.
అయితే ఒక దుబాయ్ అమెరికా అని చెప్పినప్పుడు మినిమం వాళ్ల గురించి ఎంక్వయిరీ చేయాల్సిన అవసరం బిగ్ బాస్ యాజమాన్యానికి ఉంది. ఎవర్ని పడితే వాళ్లని తీసుకొచ్చి ఇలాంటి అబద్ధాలు చెప్పించడం వలన షో మీద చాలామందికి నెగిటివ్ అభిప్రాయం కలుగుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు.
సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ చూసి అయినా కూడా వీళ్లు మారుతారేమో చూడాలి. ఇక దివాలి సందర్భంగా నేడు ప్రత్యేకమైన ఎపిసోడ్ ప్రసారం కానుంది.
Also Read: Devara 2 : నార్త్ మార్కెట్ పై దృష్టి పెట్టిన కొరటాల, దేవర 2 సినిమాలో భారీ మార్పులు