Bigg Boss 9 Day 42 Episode Review: సన్ ఫన్ డే వచ్చింది. దీపావళి స్పెషల్ గా సాగిన ఈ రోజు ఎపిసోడ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది. జటాధర మూవీ టీం, హైపర్ ఆది వచ్చి సందడి చేశారు. మధ్య మధ్యలో హీరోయిన్ల డ్యాన్స్ పర్ఫామెన్స్ ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. లిటిల్ హార్ట్స్ భామ శివాని, ఆనంది, అప్సరలు తమ డ్యాన్సతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే హౌజ్ మేట్స్ ని రెండు టీంలుగా డివైడ్ చేసి పర్పుల్, ఆరేంజ్ అని పేరు పెట్టారు.
రెండు టీంతో మధ్య పోటీ పెడుతూ గెలిచిన టీం సభ్యులకు ఫ్యామిలీ మెసేజ్ ఇచ్చారు. మొదటి రౌండ్ లో పర్పుల్ టీం గెలవడంతో సంజనకు తన భర్త నుంచి వీడియో మెసేజ్ వచ్చింది. ఇందులో తన కొడుకు నవ్వలేదని, టెన్షన్ లో ఉన్నాడేమో అని ఫుల్ ఎమోషనల్ అయ్యింది. తన బిడ్డ తింటున్నాడా? ప్లీజ్ సర్ కొనుక్కొండి అని నాగ్ ని రిక్వెస్ట్ చేయగా.. నీ కొడుకు నీలాగే.. చేతిలో ఐస్ క్రీం కూడా ఉంది చూశావుగా ఆమెకు ధైర్యం చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత గేమ్స్ వరుసగా ఆరెంజ్ టీం విన్ అవుతుండటంతో సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్ లకు వారి ఫ్యామిలీ నుంచి వీడియో మెసేజ్ లు వచ్చాయి.
అలా హౌజ్ లో ఫుల్ ఎమోషన్స్. ఆ తర్వాత జటాధర టీం వచ్చింది. ఈ సందర్భంగా పాపర్టీ రౌండ్ రెండు ఒక్కొక్కరిని పిలిచి డ్యాన్స్ కాంపిటిషన్ పెట్టారు. ఎవరేలా చేశారనేది సోనాక్షి సిన్హా, హీరో సుధీర్ బాబులు రివ్యూ ఇస్తారు. ఫైనల్ డేసిజన్ మాత్రం సంచాలక్ గా శిల్పా శిరోద్కర్ చేతిలో ఉంది. అలా కాసేపు ఫుల్ సందడి సందడి సాగింది షో. ఇక సింగర్ సాకేత్ వచ్చి ఇప్పటి వరకు హౌజ్ కంటెస్టెంట్స్ తీరు, ఆటను ఉద్దేశిస్తూ పాటతో పేరడి చేశాడు. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ ఒకే ఒక్కడు మొనగాడు.. హౌజ్ మెచ్చిన అందగాడు అంటూ ఎలివేషన్ ఇచ్చాడు.
అలా అందరికి వారి వారి ఆట తీరును బట్టి పాటతో తన కామెంట్స్ ఇచ్చాడు. ఈ పాటలో వారి ఆట మెరుగుపరుచుకోవాలని కూడా సూచించాడు. ఇక షోలో నేటి హైలెట్ పార్ట్ లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. హౌజ్ లో చేదు అనుభవం ఇచ్చిన వారికి చేదు లడ్డు ఇచ్చి ఇష్యూని క్లియర్ చేసుకోమన్నాడు నాగ్. దీంతో ఇమ్మూ తనూజకి, తనూజ కళ్యాణ్ కి, సంజన రాముకి, కళ్యాణ్ పవన్ కి, భరణి సంజనకి, సుమన్ గౌరవ్ కి, దివ్య మాధురికి ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి ఇచ్చారు. కానీ, మాధురి మాత్రం తనకు ఇప్పటి వరకు ఎవరితో చేదు అనుభవం లేదని చెప్పింది.
పాపరాయుడిని అంటూ ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది అందరి ఆట తీరు తనదైన కామెడీతో బయటపెట్టడు. ఎవరూ ఎలా ఆడుతున్నారు, ఎవరు ఎలా ఉండాలని టకటక చెప్పేసి వెళ్లిపోయాడు. ఆది వచ్చిన ఈ కాసేపు హౌజ్ అంత నవ్వులతో నిండిపోయింది. ఆడియన్స్ కి ఫుల్ ఫన్ ఇచ్చాడు. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ ఆట బాగుందని, ఇంకా మెరుగుపరుచుకుంటే విన్నర్ అయ్యే అవకాశం ఉందన్నాడు. అలాగే తనూజని కూడా వార్న్ చేశాడు. ఈ సారి లేడీ కంటెస్టెంట్ ని విన్నర్ ని చేసే అవకాశాలు ఉన్నాయి. నీ మీద నువ్వు డిపెండ్ అవుతూ, నీ ఆట నువ్వు ఆడితే చాలా టైటిల్ నువ్వే గెలిచిన ఆశ్చర్యం లేదు అని బూస్ట్ ఇచ్చాడు.
అలాగే ఆయేషాకి నవ్వుతూనే చురక అట్టించాడు. ఇండివిడ్యువాలిటీ, పోటేన్షియల్, అంటూ మూడు పాయింట్స్ తో తనూజ నామినేట్ చేశావు. కానీ, నీలోనే అవి లేవు. ఆ నామినేషన్ లోనే గౌరవ్ గెలిచిన బాల్ ని ఏడ్చి తీసుకున్నావు. అక్కడే నీ పోటేన్షియల్ లేదు. ఒక్క టాస్క్ కే ఏడ్చాను. అక్కడ ఎమోషన్ .. గేమ్ కూడా అందరం కలిసి ఆడాలని టీంగా ఆడావ్ అక్కడ నీ ఇండివిడ్యువాలిటీ ఎక్కడికి పోయింది. ఒకవేళ గౌరవ్ నీ చేతికి బాల్ ఇవ్వకపోతే ఆ తర్వాత వచ్చేది ఎమోషనలే. ఒక్కవారం, ఒక్క టాస్క్ కే మనం ఏడ్చామంటే. ఖచ్చితంగా ఐదు, ఆరు వారాలు ఉన్నావారు ఎంత ఎమోషనల్ అవుతారో వాటికి కూడా వాల్యూ ఇవ్వాలి అని చురక అట్టించాడు. అంటే నీ మాటల్లో ఉన్న దమ్ము.. నీలో లేదంటూ చెప్పకనే చెప్పి ఆయేషాకి కౌంటర్ ఇచ్చాడు. ఆది మాటలకి ఆయేషా మొహం వాడిపోయింది.
లీస్ట్ లో ఉన్న రాము, భరణి ని గార్డెన్ ఎరియాకి పిలిచాడు నాగ్. వారిలో ఎవరూ ఎలిమినేట్, ఎవరు సేవ్ అని చెప్పడానికి ముందు వారిద్దరు సేవ్ చేసే పవర్ ని ఇమ్మూకి ఇచ్చాడు. అతడి దగ్గర ఉన్న పవర్ అస్ట్రా వాడతావా అని అడగ్గా వాడతానని చెప్పి రాముని సేవ్ చేశాడు. ఇది మొదటి నుంచి అతడి ఆట బట్టి చేస్తున్నాని, ఎవరితో బాండ్స్ ఉన్న గేమ్, నామినేషన్స్ వచ్చేసరికి తన ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతున్నాడంటూ రాముని సేవ్ చేశాడు. ఇక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కూడా భరణి కంటే ఎక్కువ ఓట్స్ అందుకుని రాముని సేవ్ అయ్యాడు. దీంతో భరణి ఆరో వారం హౌజ్ ని విడాడు. భరణి ఎలిమినేట్ తో తనూజ, దివ్యు ఏడుపు స్టార్ట్ చేశారు. డిమోన్ సేవింగ్ నుంచే వీరిద్దరు భరణి ఎక్కడ ఎలిమినేట్ అవుతాడాని ఏడుపు స్టార్ట్ చేశారు. తనూజ ఏడువడం చూసి కన్ఫెషన్ రూంకి పిలిచి ఆమెతో పర్సనల్ మాట్లాడాడు నాగ్. తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నానని, ఇక్కడ నాకు మంచి బాండింగ్ ఉంది భరణితోనే.. ఇంట్లోని మరిపించే ప్రేమ ఇస్తున్నారు. అందుకే ఆయనకు నేను దగ్గర అయ్యాను అంటూ భరణి గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది.