Ban On Pakistan: ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మృతి సంఘటన ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… పాకిస్తాన్ దొంగ దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ పైన వైమానిక దాడి చేసింది పాకిస్తాన్. మొన్న అర్ధరాత్రి జరిగిన సంఘటనలో ఎనిమిది మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మరణించారు. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఉండడం గమనారసం. కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ అనే ముగ్గురు అప్ఘనిస్తాన్ క్రికెటర్లు మరణించారు. అయితే ఈ ముగ్గురు క్రికెటర్లు మృతి చెందిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐసిసికి ( ICC ) ఫిర్యాదు చేసింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డ్. అయితే దీనిపై ఐసీసీ కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు మరణించిన తరుణంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగబోయే పాకిస్తాన్, శ్రీలంక ట్రై సిరీస్ ను రద్దు చేసుకుని, ఐసీసీ కు కూడా ఫిర్యాదు చేసింది. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ రెండు కూడా ఈ సంఘటనపై స్పందించి నివాళులర్పించాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ ఆడకుండా చేయాలని, వాళ్లకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు.
ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ బోర్డులతోపాటు క్రికెటర్లు స్పందిస్తున్నారు. ముగ్గురు క్రికెటర్లు మృతి చెందిన సంఘటనను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా స్పందించింది. సరిహద్దులో పిరికిపంద చర్యకు పాకిస్తాన్ పాల్పడిందని ఫైర్ అయింది బీసీసీఐ. దొంగ దెబ్బ కాదు నేరుగా చూసుకోవాలి అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ ముగ్గురు క్రికెటర్ల మరణం అత్యంత విషాదకరమంటూ ఎమోషనల్ అయింది. ఇలాంటి కష్టతరమైన సమయంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( The Board of Control for Cricket in India). అటు ఐసిసి అధ్యక్షుడు జైషా కూడా ఇదే విధంగా స్పందించారు. ఇలాంటి సంఘటనలను ఎవరూ హర్షించబోరని ఫైర్ అయ్యారు ఐసీసీ బాస్ జై షా. కష్టకాలంలో అప్ఘనిస్తాన్ కు అండగా ఉంటామని తెలిపింది. ట్రై సిరీస్ నుంచి తప్పుకోవడం మంచి నిర్ణయం అంటూ వ్యాఖ్యానించారు.
An ACB official said, "We’ve informed ICC about Pakistan. Pakistan’s membership could likely be suspended."🤯🤣 pic.twitter.com/wcrBp2tWj8
— junaiz (@dhillow_) October 18, 2025