EPAPER

Bigg Boss 8 Day 41 Promo 3: కంటెస్టెంట్స్ కి షాక్ కి ఇచ్చిన బిగ్ బాస్.. ఒక్కొక్కరు ఒక్కో రీజన్..!

Bigg Boss 8 Day 41 Promo 3: కంటెస్టెంట్స్ కి షాక్ కి ఇచ్చిన బిగ్ బాస్.. ఒక్కొక్కరు ఒక్కో రీజన్..!

Bigg Boss 8 Day 41 Promo 3.. బిగ్ బాస్ 41వ రోజుకు సంబంధించి తాజాగా మూడవ ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాయల్ క్లాన్ సభ్యులు ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సభ్యులకు భారీ షాక్ ఇచ్చారని చెప్పాలి. ముఖ్యంగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రీజన్ చెబుతూ.. వారి సూట్ కేస్ ను ఎగ్జిట్ దగ్గర ఉంచడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఎవరు ఎవరిని ఎగ్జిట్ వైపు తీసుకెళ్తూ ఎలా కామెంట్ చేశారో ఇప్పుడు చూద్దాం.


ప్రోమో లో ఏముంది..?

శనివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ హౌస్ లో అర్హత లేని ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ మెంబర్ ను ఎంపిక చేసుకొని వారి సూట్ కేస్ తీసుకెళ్లి ఎగ్జిట్ ఏరియా దగ్గర పెట్టాలి అంటూ నాగార్జున షాక్ ఇచ్చారు. ఇక వెంటనే టేస్టీ తేజ పృథ్వి సూట్ కేస్ తీసుకుని ఎగ్జిట్ ఏరియా వద్ద పెట్టి ఎందుకు ఇలా ఎగ్జిట్ ఏరియా దగ్గర పెట్టాడో చెప్పుకొచ్చారు. టేస్టీ తేజ మాట్లాడుతూ.. ఇంటి పనుల్లో ఇంటరాక్షన్ ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ అంటూ టేస్టీ తేజ తెలిపాడు.దానికి పృథ్వీ మాట్లాడుతూ.. ఫిజికల్ టాస్క్ లో వీక్ గా ఉన్నారనిపించింది అంటూ తెలిపాడు.


హరితేజ నబీల్ సూట్ కేస్ తీసుకొచ్చి ఎగ్జిట్ ఏరియాలో పెట్టి.. ప్రత్యేకంగా వెల్ గ్రో టాస్క్ లో నబీల్ ఎందుకు ఆడుతున్నాడో ..? ఎవరికోసం ఆడుతున్నాడో..? అర్థం కాలేదు సార్ అని చెప్పగా.. నబీల్ మాట్లాడుతూ.. మిగతా వారందరూ అందరితో కలిసిపోయారు.. గౌతమ్ కొంచెం ఆ బార్డర్ మైంటైన్ చేస్తున్నారు అంటూ రాయల్ క్లాన్ సభ్యుల గురించి చెప్పుకొచ్చారు.

ముక్కు అవినాష్ నిఖిల్ సూట్ కేస్ తీసుకొచ్చి.. అసలు నన్నెందుకు కొట్టాడో అర్థం కాలేదు అని చెప్పగా.. గేమ్స్ లో ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుండు అంటూ ఆ టీంలో ఒక వ్యక్తి గురించి చెప్పారు.

ఆ తర్వాత గంగవ్వ.. మణికంఠ సూట్ కేస్ తీసుకొచ్చి ఎగ్జిట్ ఏరియాలో పెట్టి.. ఇది హౌస్ ఎంజాయ్ చేయాలి.. అది మరిచిపోవాలి అంటూ ఆయన జ్ఞాపకాలను మర్చిపోమని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత రోహిణి.. ప్రేరణ సూట్ కేస్ తీసుకొచ్చి.. ఆన్సర్ చెప్పేదాకా నాకు క్లారిటీ కనిపించలేదు సార్ అంటూ తెలిపింది.

నయనీ పావని, విష్ణుప్రియ సూట్ కేస్ తీసుకొచ్చి ఎగ్జిట్ ఏరియాలో పెడుతూ సార్ నేను ఇంటికి వచ్చిన కొత్తలో నామినేషన్ లో మొదట చేసింది విష్ణు ప్రియనే. తన ఆట కనిపించడం లేదు అని. అయినా సరే తాను మెరుగుపరచుకోలేదు అంటూ తెలిపింది. ఆ తర్వాత విష్ణు ప్రియ గేమ్ ని గేమ్ లాగే చూస్తే బాగుంటుంది అంటూ కామెంట్ చేసింది. మొత్తానికైతే కంటెస్టెంట్స్ అందరినీ షాక్ లో పెట్టేసారు బిగ్ బాస్.మరోవైపు ఈ వారం ఎలిమినేషన్ లో బాగా విష్ణు ప్రియ ఎలిమినేట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాలు రేపటితో తెలియనున్నాయని చెప్పవచ్చు.

Related News

Bigg Boss 8 Telugu : అప్పుడే మొదలెట్టేశారా?.. ఈ వారం ఆమె అవుట్..?

Bigg Boss 8 Telugu Promo: ప్రేరణ vs హరితేజ.. చెల్లుకు చెల్లు.. పడింది ఇద్దరికి పెద్ద చిల్లు..

BB Telugu 8 Promo: నామినేషన్ రచ్చ మొదలు.. ఇలాంటి గొడవ ఎక్కడ చూడలేదు భయ్యా..!

Bigg Boss 8 Telugu : హోస్ట్ నాగర్జున పైనే చిరాకు పడుతున్న యష్మీ.. అసలు ఏమైందంటే..?

Bigg Boss 8 Telugu Elimination: గంగవ్వ గేమ్స్ ఆడలేదు.. వెళ్లిపోయే ముందు నయని పావని ఓపెన్ కామెంట్స్, వారిపై కూడా..

Bigg Boss 8 Telugu Promo: అవినాష్ సీక్రెట్ బయటపెట్టిన నబీల్.. డేంజర్ జోన్‌లో హరితేజ, నయని పావని

BB Telugu 8: సండే.. ఫన్ డే.. కొత్త టాస్క్ తో కొత్త రచ్చ..!

Big Stories

×