E-Paper
Advertisement

Bigg Boss 8 Final : ముగ్గురు ఎలిమినేట్… ఆ ఇద్దరిలో కప్ ఎవరిదో…

Bigg Boss 8 Final : ముగ్గురు ఎలిమినేట్… ఆ ఇద్దరిలో కప్ ఎవరిదో…
Advertisement

Bigg Boss 8 Final.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss Telugu 8)చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని గంటలలో గ్రాండ్ ఫినాలే కూడా నిర్వహించి, విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు. గత సీజన్లతో పోల్చుకుంటే ఎన్నడూ లేని విధంగా టైటిల్ రేస్ కోసం ఇద్దరు కంటెస్టెంట్లు అతి స్వల్ప తేడాతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇక ఓటింగ్ లైన్ ముగిసినా.. తక్కువ తేడా ఉండడంతో నిర్వాహకులు కూడా ఎవరికి టైటిల్ విన్నర్ ఇవ్వాలి అనే డైలమాలో పడ్డారు. వాస్తవానికి గత కొన్ని రోజులుగా నిఖిల్ కి టైటిల్ విన్నర్ ట్రోఫీని ఇస్తారని అందరూ అనుకుంటుండగా.. గౌతమ్ కూడా అర్హులు అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

టాప్ 5 లో ముగ్గురు ఎలిమినేట్..

Advertisement

ఇదిలా ఉండగా మొత్తం 22 మందితో కొనసాగిన ఈ షోలో 5 మంది ఫైనల్ కి చేరుకున్నారు. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్. అయితే వీరిలో ముగ్గురు నిన్న ఎలిమినేట్ అయ్యారు. డిసెంబర్ 15 వ ఎపిసోడ్ కి సంబంధించిన కొంత భాగం శనివారం రోజు షూటింగ్ పూర్తి చేశారు. దాని ప్రకారమే బిగ్ బాస్ నుంచి టాప్ 5, టాప్ 4, టాప్ 3 ఇలా ముగ్గురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక వారెవరో కాదు ప్రేరణ, నబిల్, అవినాష్. మీరు ముగ్గురు వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలలో ఉండగా.. ఇప్పుడు వీరు ముగ్గురు కూడా ఎలిమినేట్ అయ్యారు.

ప్రైజ్ మనీ రిజెక్ట్ చేసిన ప్రేరణ..

Advertisement

అవినాష్ కి ఎటువంటి మనీ ఆఫర్ చేయకుండా డైరెక్ట్ గానే ఎలిమినేట్ చేశారు. అలాగే నబీల్ కూడా నాలుగో స్థానంలో ఉండగా అతడిని కూడా ఎలిమినేట్ చేశారు. ఇక మూడవ స్థానంలో ఉన్న ప్రేరణకు మాత్రం బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున 15 లక్షల రూపాయలను ప్రైజ్ మనీ కింద ఆఫర్ చేస్తే, ఆమె మాత్రం ఆ డబ్బును రిజెక్ట్ చేసింది. తాను టైటిల్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉందని నమ్ముతున్నాను అంటూ ఆ డబ్బులు రిజెక్ట్ చేసింది ప్రేరణ. అయితే ఎట్టకేలకు ఆమె మూడో స్థానంలో ఉండడంతో ఎలిమినేట్ అయింది. ఒకవేళ ఆ డబ్బు తీసుకొని ఉండి ఉంటే, తనకొచ్చే రెమ్యునరేషన్ తో పాటు రూ.15 లక్షలు కూడా అదనంగా వచ్చేది. కానీ ఆమె తన పైన ఉన్న నమ్మకాన్ని కోల్పోలేదు. అలా 15 లక్షల రూపాయలను పోగొట్టుకుంది ప్రేరణ.

నువ్వా నేనా అంటే నిఖిల్, గౌతమ్..

ఇక మరొకవైపు నిఖిల్, గౌతమ్ ఇద్దరూ కూడా టైటిల్ రేస్ లో నువ్వా నేనా అంటూ గట్టిగా పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇవ్వనున్నారు అనే ఉత్కంఠ అభిమానులలో కూడా నెలకొంది. ఎందుకంటే గత సీజన్లలో విన్నర్ ఎవరో మూడు వారాల ముందే తెలిసేది. కానీ ఈ సీజన్ మాత్రం మరింత టఫ్ గా మారింది. అందుకే అటు కంటెస్టెంట్స్ ఇటు ఆడియన్స్ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఇద్దరిలో ఒకరు టైటిల్ విజేతగా నిలవబోతున్నారు. ఈ విషయం తెలియాలంటే ఈరోజు రాత్రికి గ్రాండ్ ఫినాలే జరిగే వరకు ఎదురు చూడాల్సిందే.

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×