Rajat Patidar: ఇప్పటివరకు ఐపీఎల్ లో 17 సీజన్లు జరగగా.. టైటిల్ గెలవలేకపోయిన ఏకైక టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రమే. అలాగని ఆర్సిబి మొత్తానికి ఫెయిల్యూర్ టీమ్ కూడా కాదు. మూడుసార్లు ఫైనల్ చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్.. మరో ఆరుసార్లు ప్లేఆఫ్స్ కి అర్హత సాధించింది. గత ఐదు సీజన్లలో నాలుగు సార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన ఆర్సిబి.. 2023 సీజన్ లో ఆరో స్థానంలో నిలిచి తృటిలో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఇక తొమ్మిది సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. 2021 సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
Also Read: Mohammed Shami: రోహిత్ శర్మ టార్చర్.. రిటైర్మెంట్ దిశగా షమీ..?
ఆ తర్వాత 2022 సీజన్ నుంచి గత మూడు సీజన్లకు ఫాఫ్ డూప్లిసిస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఈ 2025 సీజన్ లో ఓ యంగ్ ప్లేయర్ కి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అతను ఎవరో కాదు రజత్ పాటిదార్ {Rajat Patidar}. 2022 ఐపిఎల్ సీజన్ లో ఆర్సిబి తరపున లీగ్ లోకి అరంగేట్రం చేసిన ఈ యంగ్ ప్లేయర్.. తన ఆట తీరుతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక కాలి గాయం కారణంగా ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్ {Rajat Patidar} 2023 సీజన్ లో ఐపీఎల్ ఆడలేకపోయాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ లో నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లలో రజత్ పాటిదార్ {Rajat Patidar} ఒకరు. 2025 సీజన్ కి రజత్ పటిదార్ కి 11 కోట్లతో రిటైన్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2025 వేలంలో ఆర్సిబి పేసర్ భువనేశ్వర్ కుమార్, జోస్ హెజిల్ వుడ్, లుంగీ ఎంగిడి వంటి కీలక ప్లేయర్లను దక్కించుకుంది. ఇక డూప్లెస్ ఇస్ కెప్టెన్సీ లో ఆర్సిబి అద్భుత విజయాలు సాధించినప్పటికీ.. టైటిల్ గెలవడంలో విఫలమైంది. దీంతో డూప్లెస్ స్థానంలో రజత్ పాటిదార్ ను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ గా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కొన్ని నివేదికలు సైతం పాటిదార్ ని కెప్టెన్ గా చేస్తారని తెలిపాయి. రజత్ పాటిదార్ {Rajat Patidar} మొత్తం 27 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి.. 799 పరుగులు సాధించాడు. అతని ఖాతాలో ఏడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన పాటిదార్.. తన కెప్టెన్సీ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే.. మెగా వేళానికి ముందు ఆర్సిబి రిటెన్షన్ కోసం విరాట్ కోహ్లీకి 21 కోట్లు, రజత్ పాటీదార్ కి 11 కోట్లు, ఎస్ దయాల్ కి ఐదు కోట్లు ఖర్చు చేసింది.
Also Read: IND vs AUS: ఫీల్డింగ్ చేస్తుండగా మహమ్మద్ సిరాజ్ కి ఘోర అవమానం
ఇక మొత్తం 37 కోట్లతో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది ఆర్సిబి. అలాగే మెగా వేలంలోకి 83 కోట్లతో అడుగుపెట్టిన బెంగళూరు.. పేసర్ జోష్ హెజిల్ వుడ్, ఇంగ్లాండ్ ఓపెనర్ ఫీల్ స్టాల్ ల కోసం అత్యధిక మొత్తాన్ని ఖర్చు పెట్టింది. గత సీజన్ వరకు కెప్టెన్ గా ఉన్న డూప్లెసిస్ సహా గ్లైన్ మ్యాక్స్ వెల్, వెల్ జాక్స్, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లను వదిలేసింది. వారికి బదులుగా జట్టులోకి ఫిల్ సాల్ట్, లివింగ్ స్టోన్, భువనేశ్వర్ కుమార్ ని తీసుకుంది.