BigTV English

Bigg Boss 8 Telugu : ఈ వీక్ సెలబ్రెటీల రచ్చ… హౌస్ లో సందడి చేయనున్న స్టార్స్ వీళ్ళే

Bigg Boss 8 Telugu : ఈ వీక్ సెలబ్రెటీల రచ్చ… హౌస్ లో సందడి చేయనున్న స్టార్స్ వీళ్ళే

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ వేదికపై పలువురు సెలబ్రిటీలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వారం కూడా తెలుగు బిగ్ బాస్ హౌస్ లో పలువురు సినీ ప్రముఖులు సందడి చేయబోతున్నారు. ఆ స్టార్ హీరోలు ఎవరో తెలుసుకుందాం పదండి.


బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు (Bigg Boss 8 Telugu) 8వ వారం గేమ్ రసవత్తరంగా మారింది. ఈవారం చీఫ్ కంటెండర్ కోసం జరిగిన టాస్క్ లలో ఓజి క్లాన్ మెంబర్స్ డూ ఆర్ డై అన్నట్టుగా ఆడారు. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీకెండ్ రానే వచ్చింది. అయితే ఎప్పట్లాగే ఈ వారం కూడా హౌస్ లో పలువు సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం పదండి. బిగ్ బాస్ కు బుల్లితెరపై ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ లలో చాలా మందికి భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడతారు. అలాగే ఈ షోకి వచ్చే రేటింగ్ లు కూడా రికార్డు స్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు తమ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ను బిగ్ బాస్ వేదికగా జరపడానికి ఆసక్తిని కనపరుస్తారు.

ఈ బిగ్గెస్ట్ బుల్లితెర షో (Bigg Boss 8 Telugu)లో కాసేపు సందడి చేసి బుల్లితెర ప్రేక్షకుల్లో తమ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తారు. అందులో భాగంగా ఇప్పటికే పాల్గొన్న పలువురు ప్రముఖులు బిగ్ బాస్ వేదికపై తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. అయితే తాజా వీకెండ్ కూడా మరి కొంతమంది సెలబ్రిటీలు బిగ్ బాస్ వేదికపై సందడి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈవారం బిగ్ బాస్ హౌస్ లో కిరణ్ అబ్బవరం, శివ కార్తికేయన్, కోలీవుడ్ స్టార్ సూర్య తమ సినిమాలను ప్రమోట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.


సూర్య నటించిన ‘కంగువ’ (Kanguva) మూవీ నవంబర్ 14న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న సూర్య పనిలో పనిగా బిగ్ బాస్ వేదికపై కూడా కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే హౌస్ లో సూర్య టీంకి సంబంధించిన షూట్ పూర్తయింది. దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయబోతున్న సినిమాల్లో కిరణ్ అబ్బవరం ‘క’ (Ka), శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘అమరన్’ (Amaran) ఉన్నాయి. ఈ రెండు సినిమాలను కూడా బిగ్ బాస్ వేదికపై ప్రమోట్ చేయడంలో భాగంగా షూట్ జరుపుతున్నారని సమాచారం.

కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) మార్నింగ్ సెషన్ షూటింగ్లో పాల్గొనగా, శివ కార్తికేయన్ షూటింగ్ ఈవినింగ్ సెషన్ లో జరుగుతున్నట్టుగా సమాచారం. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ షోలో సెలబ్రెటీల హడావిడి ఓ రేంజ్ లో కనిపించబోతోంది. మరి బిగ్ బాస్ షో ఈ స్టార్స్ కు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలియాలంటే సినిమాల రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Related News

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Big Stories

×