BigTV English

Bigg Boss 8Teugu : సూర్య ఎంట్రీతో రెట్టింపు జోష్.. నిఖిల్ నాకే కావాలంటు యష్మీ ఫైట్..

Bigg Boss 8Teugu : సూర్య ఎంట్రీతో రెట్టింపు జోష్.. నిఖిల్ నాకే కావాలంటు యష్మీ ఫైట్..

Bigg Boss 8Teugu : బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకు లవ్ ట్రాక్ లు పెరిగిపోతున్నాయి. నిన్నటివరకు పృథ్వి, విష్ణు ప్రియా మధ్య లవ్ ఉందని అందరు అనుకున్నారు. అలాగే విష్ణు పృథ్వి పై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో పృథ్వీ నామినేట్ అవ్వడంతో అందరు క్లాస్ పీకారు దాంతో పృథ్వీ విష్ణు ప్రియాకు బ్రేకప్ చెప్పేసాడు. ఇక అప్పటి నుంచి విష్ణు తన పనేంటో తాను చేసుకుంటూ పోతుంది. అంతేకాదు ఆటలో సత్తా చాటుతూ మెగా చీఫ్ అయ్యింది. తొమ్మిదో వారానికి గాను హౌస్ కు మెగా చీఫ్ అయ్యింది. తాజాగా శనివారం ఎపిసోడ్ లో నాగార్జున విష్ణు పై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక కంగువ ప్రమోషన్స్ కోసం తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.. శనివారం ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


ఇక శనివారం ఎపిసోడ్‌కి హీరో సూర్య గెస్టుగా వస్తున్నారనే విషయం ముందు రోజు సాయంత్రమే కంటెస్టెంట్లకి చెప్పింది బిగ్‌బాస్ టీమ్. అంతేకాకుండా సూర్య కోసం కంటెస్టెంట్స్ అందరూ డ్యాన్స్ చేయాలంటూ పెయిర్స్ లిస్ట్ కూడా పంపించింది. అందులో నిఖిల్- యష్మీ, విష్ణుప్రియ-పృథ్వీ, మెహబూబ్-నయని, హరితేజ-టేస్టీ తేజ, గౌతమ్-నయని, రోహిణి-అవినాష్, నబీల్-ప్రేరణ… జోడీలుగా పెర్ఫామ్ చేయాలంటూ బిగ్‌బాస్ లిస్ట్ పంపించాడు. ఈ లిస్ట్ ప్రకారం డ్యాన్స్ ప్రాక్టీస్ చెయ్యాలని బిగ్ బాస్ చెబుతాడు.

కానీ కండల వీరుడు పృథ్వీ మాత్రం విష్ణుతో కలిసి చేయడం ఇష్టం లేక కిచెన్‌లో డిషెస్ వాష్ చేస్తూ టైమ్ పాస్ చేశాడు. దీంతో విష్ణు వచ్చి ఏంటి ప్రాక్టీస్ చేయవా రా అని అడిగితే ఇష్టం లేనట్లు బిహేవ్ చేశాడు. ఇక దీనికి హర్ట్ అయిన విష్ణుప్రియ.. కెమెరా దగ్గరికెళ్లి తన జోడీని మార్చాలి.. పృథ్వీకి ఇష్టం లేదంటూ రిక్వెస్ట్ చేసింది. దీంతో కాసేపటికీ మరో లెటర్ పంపించాడు బిగ్‌బాస్.. అందులో పేర్లు మార్చారు. నిఖిల్, విష్ణు ప్రియా, పృథ్వీ, యష్మీ అని ఇచ్చారు. దానికి యష్మీ ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది. విష్ణు ప్రియా వల్లే ఇదంతా జరిగిందని బాధ పడింది. నిఖిల్ ఓదార్చడం ఇదంతా చూస్తున్న జనాలకు ఇంకేదో డౌట్స్ వస్తున్నాయి. మొత్తానికి ఎపిసోడ్ లో సూర్య కోసం అందరు డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేసారు. ఆ ఎపిసోడ్ అయ్యాక ఈ గొడవ సంగతి బయట పడింది.


విష్ణుప్రియ అంత సెల్ఫిష్ ఎవరూ ఉండరు.. మీ ఇద్దరి కోసం నేను ఎంత చేశాను, కానీ ఇప్పుడు నిఖిల్ నుంచి నన్ను దూరం చేసింది.. పృథ్వీతో చెప్పింది. ఏమైందంటూ నిఖిల్ రాగానే పట్టుకొని ఏడ్చేసింది యష్మీ. ఇదంతా చూసి విష్ణు.. యష్మీ దగ్గరికొచ్చి మాట్లాడింది. నేను నిన్ను, నిఖిల్‌ని ఛేంజ్ చేయమని అడగలేదు.. పృథ్వీకి ఇష్టం లేదని మార్చమన్నాను అంటూ విష్ణు క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నువ్వు అలా ఎలా అడుగుతావ్.. మార్చమంటే మమ్మల్నే మారుస్తారు. అని యష్మీ గోలాగోల చేస్తుంది. చివరకు పంతం నెగ్గించుకుంటుంది. ఈ రచ్చ తో యష్మీ పృథ్వీ ల మధ్య ఎదో ఉందని జనాలు ఫిక్స్ అయ్యారు..

Related News

Bigg Boss Thanuja: ఫస్ట్ లవ్ రివీల్ చేసిన తనూజ, మరీ ఇంత ముదురా?

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ ప్రియా శెట్టి.. కానీ?

Bigg Boss 9 Promo: గోల్డెన్ ఆపర్చునిటీ.. పాపం ఆ కంటెస్టెంట్ బలి!

Bigg Boss 9: నామినేషన్ లో 6గురు..గురి వారి మీదే!

Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?

Bigg Boss 9 Promo: మళ్లీ నోరు జారిన హరిత హరీష్.. ఈసారి బ్యాండ్ బాగానే!

Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ షురూ.. వ్యాలీడ్ పాయింట్స్ చెప్పండమ్మా!

Bigg Boss 9: సంజన పోపు ఘాటు దెబ్బకు తనూజ అవుట్.. మాస్క్ మ్యాన్ సైలెంట్ కౌంటర్..

Big Stories

×