Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. తెలుగులో 9వ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా కామనర్స్, సెలబ్రిటీలు ఉన్నప్పుడు ఈ షో చప్పిడిగా సాగినా.. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫైర్ మరింత ఎక్కువైంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఆరవ వారం మొదలైంది. మరి ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కూడా బిగ్ బాస్ మొదలుపెట్టేశారు. ఇకపోతే ఆరవ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ వైల్డ్ స్ట్రోమ్ చేతుల్లోనే ఉంటుంది అని బిగ్ బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా బజర్ మోగగానే బాల్ ను ఎవరైతే వైల్డ్ కార్డ్స్ పట్టుకుంటారో వారు మిగిలిన కంటెస్టెంట్స్ కి తమ బాలు ఇచ్చి ఇతరులను నామినేట్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. అలా నిన్నటి నుంచి కొనసాగుతున్న ఈ నామినేషన్స్ రచ్చకు సంబంధించి ఇప్పుడు తాజాగా మరో ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. అందులో 37వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. రాము రాథోడ్, రీతు చౌదరి ఇద్దరు నామినేషన్ విషయం పైనే గొడవపడ్డారు. ఇమ్మానుయేల్ అన్న నీకు రూల్స్ చెప్పారు అని రాము రాథోడ్ అంటే.. రీతు చౌదరి ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని ఒకటి చెప్పాలి కదా అంటూ రీతు చౌదరి అరిచేసింది. సంచాలక్ నువ్వు కదా నువ్వు చెప్పాలి కదా అంటూ తెలపగా.. స్పెషల్ రూల్స్ పెట్టలేదు అంటూ రాము రాథోడ్ కూడా అరిచేసాడు. ఇక వెంటనే బజర్ మోగింది. బాల్ కోసం వైల్డ్ కార్డు ఎంట్రీస్ పరిగెత్తగా.. దివ్వెల మాధురి బాల్ ను దక్కించుకొని రీతుకి ఇచ్చింది.
రీతు నామినేషన్స్ లో భాగంగా మొదట భరణిని నామినేట్ చేసింది. ఈ మనిషి మాట ఇచ్చాడా ఈ మనిషి మాట ఇచ్చాడంటే అది జరుగుతుంది అనే నమ్మకం నాకు మీ దగ్గర కోల్పోయారు అంటూ రీతు చౌదరి అనగా.. భరణి శంకర్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్ని టాస్క్లు ఆడావో చెప్పు అని అడిగాడు. దాంతో కెప్టెన్ టాస్క్ నాకు మీ సపోర్ట్ కంపల్సరిగా కావాల్సింది. కానీ మీరు రాముకి సపోర్ట్ చేశారు అంటూ తెలిపింది. రాము నువ్వు ఉండగా నేను రాముకి సపోర్ట్ చేస్తాను అంటూ భరణి కామెంట్ చేశారు. తర్వాత సంజన తన నామినేషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. రాముతో అందరి ముందు ఫ్రీజింగ్ అటాక్ అయ్యి నేను ఇక్కడ పడిపోతే.. చచ్చిపోతావా అక్కడ ఒక రోజు రాత్రి పడుకుంటే.. నాకు ఏమైనా బంగారం దొరుకుతుందా అసలు ఇదేనా నీ హ్యూమానిటీ అంటూ రాము రాథోడ్ పై మండిపడింది. నా చెల్లి, అక్క ఉన్న అలాగే చేస్తానంటూ రాము కామెంట్ చేశారు. అసలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటూ ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే అసలు మీకు మానవత్వం ఉందా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:#Mega 158: చిరు కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్.. శివయ్య ఆశీర్వాదంతో షూటింగ్ అప్పుడే!