Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. వాళ్లు బయటకు వెళ్లి పోయారు కాబట్టి ఆల్రెడీ ఉన్న వాళ్ళ మధ్య గేమ్ చాలా ఈజీ అయిపోతుంది అనుకున్న తరుణంలో, కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో లోపలికి ఆరుగురిని పంపించిన సంగతి తెలిసిందే.
వారిలో నలుగురు సెలబ్రిటీస్ మిగతా ఇద్దరూ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన కామనర్స్. దువ్వాడ మాధురి, రమ్య మోక్ష వీరిద్దరూ రీసెంట్ టైమ్స్ లో విపరీతంగా పాపులర్ అయ్యారు. బహుశా అందుకే వీళ్లను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేలా చేశారు.
బిగ్ బాస్ సీజన్ 9 లో నిఖిల్ నాయర్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన గేమ్ చూస్తుంటే నిఖిల్ నాయర్ చాలా మెచ్యూర్ మరియు స్ట్రాంగ్ అనే ఫీలింగ్ వస్తుంది.
ఆయేషా తమిళ్ బిగ్ బాస్ లో దాదాపు 65 రోజులు పాటు ఉంది. అంటే గేమ్స్ గురించి ఆ అట్మాస్పియర్ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. స్టేజి మీదకి రాగానే మంచి ఎనర్జీతో మాట్లాడింది. నాగార్జున కూడా వావ్ ఎనర్జీ అని చెప్పారు. తను చాలా హైపర్ అనిపిస్తుంది ఏదున్నా కూడా మొహం మీద మాట్లాడటం అలవాటు చేసుకుంది.
మోక్ష రమ్య అయితే చాలా కాన్ఫిడెన్స్ లాగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి మాత్రం మెచ్యూర్ , అలానే నిజాయితీగా లేదు అనిపిస్తుంది.
సాయి శ్రీనివాస్ గోల్కొండ హై స్కూల్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున నటించిన కేడి, ముఖ్యంగా ఊపిరి సినిమాలో కార్తీకి తమ్ముడు పాత్రలో కనిపించాడు. తర్వాత శుభలేఖలు, వినరా సోదర వీర కుమారా వంటి సినిమాలు చేశాడు. కానీ ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు గుర్తింపు కోసమే బిగ్ బాస్ కి వచ్చినట్టు చెప్పాడు. కానీ చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు ఎక్కువగా మాట్లాడటం లేదు.
గౌరవ్ గుప్తా చాలా ఫ్రీ మైండ్ సెట్ లా అనిపిస్తున్నాడు. కొన్ని పనుల్లో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అలానే ఎటువంటి ఇగో లేకుండా చాలామందితో ఫ్రీగా మాట్లాడుతున్నాడు. లాంగ్వేజ్ వచ్చేస్తే అందరికీ బాగా కనెక్ట్ అవుతాడేమో అనిపిస్తుంది.
దువ్వాడ మాధురి ఈవిడ గురించి కొన్ని ఇంటర్వ్యూలు చేస్తే మాట్లాడే తీరు ఏంటో అర్థం అవుతుంది. నచ్చని వాళ్ళతో దువ్వాడ మాధురికి ఇగో ఇష్యూస్ ఉన్నాయి. మిగిలిన వాళ్లతో మాత్రం కొంచెం రిసీవింగ్ మోడ్ లోనే ఉంది.
ఇప్పటివరకు జరిగిన గేమ్ ను బట్టి ఇలా అనిపిస్తుంది మరి ముందు ముందు ఏం జరుగుతుందో ఎవరి రంగులు ఎలా బయటపడతాయో తెలియాల్సి ఉంది.
Also Read: Bigg Boss 9 promo : ఫైవ్ మినిట్స్ చాట్ పాప ఫ్లాట్ , ఇమ్మూ కొత్త లవ్ ట్రాక్ ఈసారి చెన్నై పాపతో