Bigg Boss 9 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైన విషయం తెలిసిందే.కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 6 మంది కామనర్స్ ను హౌస్ లోకి పంపించారు. ముఖ్యంగా 20,000 మంది నుండి దరఖాస్తులను స్వీకరించి.. పలు టెస్ట్ల ద్వారా 45 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షో నిర్వహించి, అందులో సత్తా చాటిన 6 మందిని హౌస్ లోకి పంపించడం జరిగింది. అలా ఆరు మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టి.. సత్తా చాటే ప్రయత్నం చేశారు. వారిలో దమ్ము శ్రీజ (Sreeja Dammu)గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అగ్నిపరీక్ష షోలోకి అడుగుపెట్టిన తొలి రోజే యాంకర్ శ్రీముఖికి తన మాటలతో.. లాజిక్ ప్రశ్నలతో చెమటలు పట్టించింది. పిట్ట కొంచెం కూత ఘనం రేంజ్ లో తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసి.. హౌస్ లో ఛాన్స్ దక్కించుకుంది. మొదటి రెండు మూడు వారాలలో నోరు పారేసుకుని ఎప్పుడెప్పుడు బయటకు వెళ్తుందా అనేంతలా అందరికీ విసుగు తెప్పించిన ఈమె.. ఆ తర్వాత కాలంలో తన ఆటలో మార్పులు తీసుకొచ్చి ఆడపులిలా పేరు దక్కించుకుంది. అయితే అలాంటి ఆడ పులి టైటిల్ గెలుచుకుంటుంది అని అభిమానులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేయగా.. అనూహ్యంగా ఐదవ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐదవ వారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు రావడంతో తట్టుకోలేకపోయిన శ్రీజ తాజాగా అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఒక కోరిక తీరలేదు.. నన్ను క్షమించండి అంటూ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియో రిలీజ్ చేసింది. మరి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
ALSO READ:Bigg Boss 9 Promo: నామినేషన్ రచ్చ.. అసలు మానవత్వం ఉందట్రా మీకు?
“నేను కూడా మీలాగే ఇంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదు. నాకోసం చాలామంది సపోర్ట్ చేశారు. పిల్లల్ని మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఎంతో మంది సపోర్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నావల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అవన్నీ మార్చుకొని నేను గేమ్ స్టార్ట్ చేసి మంచిగా పేరు తెచ్చుకునే సమయంలో ఇలా హౌస్ నుంచి బయటకు రావడం బాధగా ఉంది. నా అర్హత అక్కడి వరకే.. ఎవరినీ ప్రశ్నించాలని అనుకోవట్లేదు. మంచిగా గేమ్స్ ఆడి అందరి మన్ననలు పొంది టాప్ లో చూద్దామనే కోరిక ఉండేది. కానీ ఆ కోరిక తీరకుండానే బయటకు వచ్చేసాను. ఇప్పటికీ ఆ బాధ నుండి బయటపడలేకపోతున్నాను. కానీ మీ అందరికీ ధన్యవాదాలు మాత్రమే చెప్పుకోగలను ” అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది శ్రీజ. ఇకపోతే శ్రీజ ఎలిమినేట్ అవ్వడంతో.. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఎవరికి లాభం మొదటి నుంచే బాగా ఆడింటే ఇంకొన్ని రోజులు కొనసాగే దానివి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కారణంగానే శ్రీజ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
?utm_source=ig_web_copy_link