Bigg Boss 9 Telugu: తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్న ఏకైక టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన భాషల్లో ఎక్కువ సీజన్లో జరిగిన సరే తెలుగులో 8 సీజన్లను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం 9 వ సీజన్ ప్రసారం అవుతున్న విషయం తెలిసింది.. ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలోకి వైల్డ్ కార్డు ద్వారా కొందరు ఎంట్రీ ఇచ్చేశారు. మిగిలిన వాళ్ళ సంగతి ఏమో కానీ దువ్వాడ మాధురి, రమ్య మోక్ష పైనే ఎక్కువ ఫోకస్ చూపిస్తున్నారు జనాలు. మాధురి హౌస్ లోకి రాగానే కంటెస్టంట్స్ ని ఒక్కసారిగా గడగడలాడించేసింది.. ఆమె దూకుడుని చూసి ఇక హౌస్ లో రోజు గొడవలు తప్పవని ఆడియోస్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఆమె ఎంట్రీ తో తనుజ పార్టీ మార్చేసింది. అసలు హౌస్ లో ఏం జరుగుతుంది? బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా వీళ్ళని తీసుకొచ్చి తప్పు చేశాడా? నెక్స్ట్ వీక్ నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతి సీజన్ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వడం కామన్. అయితే గత సీజన్లోతో పోలిస్తే ఈ సీజన్ దారుణంగా ఉందని ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు. అప్పట్లో సెలబ్రిటీలను లేదా పాత కంటెంట్ ను మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ఒకేసారి కొత్త వాళ్లందర్నీ దించడంతో ప్రేక్షకులకు కన్ఫ్యూజన్ మొదలైంది..నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా కాస్త సైలెంట్‌గా వాళ్ల పని వాళ్లు చేసుకుంటూ పోతున్నారు. శ్రీనివాస్ అస్సలు ఉన్నాడా లేదా అనే సందేహం కూడా వస్తుంది. మాధురిని చీఫ్ షెఫ్ అంటూ దివ్య పెట్టింది.. అదే మిస్టేక్.. దాంతో ఆమె ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే రచ్చ మొదలు పెట్టింది.. ఇకముందు ఏం జరుగుతుందో చూడాలి..
Also Read: ‘గుండెనిండా గుడిగంటలు’ కామాక్షి రియల్ లైఫ్ లో అన్నీ కష్టాలే.. 12 ఏట పెళ్లి..
ఈమధ్య బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తిండి మీద ఫోకస్ చేసినట్లు టాస్క్ మీద ఫోకస్ చేయలేదని కామెంట్లు కూడా అందుకుంటున్నారు.. మొదటినుంచి ఫుడ్ దగ్గర గొడవలే జరుగుతున్నాయి తప్ప పనికొచ్చే పనిలేవి చేయట్లేదు అంటూ ఆడియన్స్ నోటికి వచ్చినట్లు తిట్టేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కూడా మాధురి వర్సెస్ దివ్య మధ్య పెద్ద గొడవ జరుగుతుంది.. బీన్స్ ఎంతసేపటి నుంచి చేస్తున్నారు అయిందా.. అంటూ దివ్య సెటైర్ వేసింది. బీన్స్ ఉడక్కపోతే నన్నేం చేయమంటారు.. కూర్చొని వండాలా ఏంటి లోపల.. అని మాధురి వెటకారం ఆడింది. బిగ్ బాస్ ప్రాబ్లమ్ నా మీద చూపిస్తారు అని మాధురి రెచ్చిపోతుంది. కర్రీ ఉడక్కపోతే నేనేం చేయాలి.. అంటూ చిరాకుపడింది మాధురి. ఆ వెంటనే మాధురి కన్నీళ్లు పెట్టుకోవడంతో తనూజ హగ్ ఇస్తూ ఓదార్చింది.. మొత్తానికి తనుజ మాధురికి దగ్గర ఏ ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భరణి సంగతి ఏంటో అని ఆడియన్స్ చెవులు కోరుకుంటున్నారు. ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే.