Jubilee Hills Bypoll: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కింది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నామినేషన్ల నోటిఫికేషన్ వచ్చి ఒకరోజు గడిచినా బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ పార్టీ తరపున విక్రమ్ గౌడ్ వెలుగులోకి వచ్చింది. ఎవరు విక్రమ్ గౌడ్?
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరు?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. తొలిరోజు దాదాపు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఇద్దరు రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు కాగా, మరో 9 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. తమతమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
ఇటు అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత రేసులో ఉన్నారు. మంచి రోజు చూసుకుని ఈ అభ్యర్థులు రేపోమాపో నామినేషన్లు వేయనున్నారు. ఇంకా బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై తర్జనభర్జన కొనసాగుతోంది. బీజేపీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా తెరపైకి విక్రమ్ గౌడ్ వచ్చింది. మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పేరు.
తెరపైకి విక్రమ్‌గౌడ్
ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు విక్రమ్‌గౌడ్ బీజేపీలో చేరారు. గోషామహల్ టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో విక్రమ్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమనే వాదనను చెక్ పెట్టేందుకు ఆయనను తెరపైకి తెచ్చినట్టు ఆ పార్టీ వర్గాల మాట.
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు విక్రమ్ గౌడ్ బీజేపీలో చేరారు. గోషామహల్ టికెట్ కోసం ఆయన ప్రయత్నాలు చేశారు. అనుహ్యంగా మరొకరు ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దీంతో ఆయన బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో విక్రమ్ గౌడ్ పేరు బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ALSO READ: ఏపీ-తెలంగాణకు భారీ వర్ష సూచన
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమనే వాదనను చెక్ పెట్టేందుకు ఆయనను తెరపైకి తెచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. విక్రమ్‌గౌడ్ పేరు బయటకు రాగానే బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా షాకయ్యారు. బీజేపీ టికెట్ కోసం దీపక్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం ఆ నియోజకవర్గంలో చాన్నాళ్లుగా తిరుగుతున్నారు.
బీజేపీతో తెలంగాణ అభివృద్ది సాధ్యమని ప్రచారం చేస్తున్నారు కూడా. తెలంగాణ బీజేపీ నాయకత్వం ముగ్గురు పేర్లతో జాబితాను హైకమాండ్‌కు పంపింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఢిల్లీ వెళ్లారు. అభ్యర్థి విషయంపై పార్టీ కీలక నేతలతో చర్చించారు. అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించకపోతే ప్రచారం ఎప్పుడు చేస్తామని బీజేపీ శ్రేణులు అంటున్నారు.
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి.. తెరపైకి విక్రమ్ గౌడ్..?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అభ్యర్థిగా తెరపైకి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరు
జూబ్లీహిల్స్ బైపోల్లో ఖరారు కాని బీజేపీ అభ్యర్థి
ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని విక్రమ్ గౌడ్ pic.twitter.com/i55aWM5XxK
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025