Bigg Boss 9 Promo: ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. వైల్డ్ కార్డు ద్వారా మధ్యలో మరొక కామనర్ హౌస్ లోకి అడుగుపెట్టింది. అలాగే 6 మంది సెలబ్రిటీలు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఆట మరింత రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఒక్కొక్కరు చేసిన తప్పులను చూపిస్తూ.. వెనుక ఎవరు ఎలా మాట్లాడుతున్నారో వీడియోలు వేసి మరీ అందరి బండారాలు బయటపెట్టేశారు నాగార్జున.
ట్రైలర్ విషయానికి వస్తే.. రమ్య, కళ్యాణ్ ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మన్నారు నాగార్జున. అలా వెళ్లగానే ఆమె క్రౌన్ పెట్టుకొని సోఫాలో కూర్చునింది. ఆమె పక్కనే కళ్యాణ్ చేతులు కట్టుకొని నిలబడడం చూసే వారికి కాస్త ఇబ్బందిగా అనిపించిందని చెప్పవచ్చు. హోస్ట్ నాగార్జునకు కూడా ఇదే అనిపించిందేమో.. నాగార్జున మాట్లాడుతూ.. క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి కాము.. ఆ క్రౌన్ కి మనల్ని అర్హత ఉండేలా చేసేది మన మాట తీరు.. అని చెబుతూ ఒక వీడియో చూపించారు నాగార్జున. అందులో మాధురి దగ్గర రమ్య మాట్లాడుతూ..” చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మొదటి రోజు అతను వచ్చి కూర్చోవడం.. చేతులు ఎక్కడపడితే అక్కడ వేయడం.. ఆ అమ్మాయితో ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా.. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒకటి ఇచ్చేస్తాను” అంటూ రమ్య మాధురి తో చెప్పిన విజువల్ ని ప్లే చేశాడు నాగార్జున. ఇది చూసిన కళ్యాణ్ కూడా ఆశ్చర్యపోయాడు. నాగార్జున మాట్లాడుతూ.. ఒక మనిషిని అమ్మాయిల పిచ్చోడు అని అనడం ఎంతవరకు కరెక్ట్.. జీవితాంతం నువ్వు అతడిని చూడలేదు కదా అంటూ రమ్య కి కౌంటర్ ఇచ్చారు
ఇక తర్వాత పవన్, రీతూ చౌదరి రిలేషన్ గురించి మాట్లాడుతూ..” మీ ఇద్దరి మధ్య నువ్వు ఏ జోన్ లో ఉన్నావు? అని ప్రశ్నించగా.. రీతూ చౌదరి నేను చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. ఏదైనా ఒక విషయాన్ని ఎవరితోనైనా పంచుకోవాలి అంటే మనస్ఫూర్తిగా అది పవన్ తోనే అంటూ తెలిపింది రీతూ చౌదరి. అయితే పవన్ రమ్యతో మాట్లాడిన వీడియోని వేశారు నాగార్జున. అందులో పవన్ తన బుద్ధి బయట పెట్టాడు. నేను అమ్మాయిని లవ్ చేయట్లేదు. అని చెప్పాడు కంఫర్ట్ జోన్ లోనే ఉన్నానని చెబుతున్నాడు. కానీ ఇక్కడ రీతూనే మోసం చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆడియన్ పోల్ నిర్వహించగా పవన్ మోసం చేశాడంటూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పడంతో ఆఖరికి హోస్ట్ నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు.
ALSO READ:Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!
తర్వాత ప్రోమో ఎండింగ్ సమయానికి బ్రేక్ తరువాత ఇమ్ము నీకు పగిలిపోద్ది అంటూ ఇచ్చిన వార్నింగ్ మరింత వైరల్ గా మారుతుంది. మరి ఏం జరగనుందో తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.