Bigg Boss 9 Day 45 Episode Review: డబ్బుల పంజాయతీ ఇంకా తెగలేదు. తనూజ, సుమన్ శెట్టిలు సంజన టీం డబ్బులు కొట్టేసిన విషయం తెలిసిందే. సుమన్ శెట్టి డబ్బులు తీశానని ఒప్పుకున్నాడు. కానీ, తనూజ మాత్రం బయటపడటం లేదు. అందరికి తనపై డౌట్ ఉన్న లేదు.. నేను తీయలేదని స్ట్రాంగ్ డిఫెండ్ చేసుకుంటుంది. ఆఖరి రాజు (మాధురి) వచ్చి అడిగిన ఒప్పుకోవడం లేదు. కానీ, దివ్య మాత్రం డబ్బులు తీశానని బయటపడింది. దొంగలించిన డబ్బుని టీం అంత పంచుకోవాలని రీతూ, మాధురి అనడంతో తనూజ ఒంటికాలిపై లేచింది. దొంగతనం చేసిన డబ్బులు ఎందుకు పంచాలని ఖండించింది. దీంతో రీతూ, తనూజ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అలాగే మాధురి సైతం ఎమోషనల్ అయ్యింది. కానీ, ఆ తర్వాత తనూజ వచ్చి నచ్చజేప్పడంతో మాధురి కూల్ అయ్యింది.
ఆ తర్వాత సుమన్ పక్కకు తీసుకువెళ్లి.. అసలు బయటపడకంటూ మోటివేట్ చేస్తుంది. గేమే దొంగతనం చేయడం.. డబ్బుని అందరికి షేర్ చేయనవసరం లేదు అని చెబుతుంది. అసలు డబ్బు ఎవరి దగ్గర ఉంది.. ఎవరూ తీశారో క్లారిటీ లేక సంజన అండ్ టీం గిల గిల కొట్టుకుంటుంది. మా డబ్బు ఇచ్చేవరకు గేమ్ ఆడనంటూ అలిగి కూర్చుంది సంజన. దివ్య తీసిందని తెలిసి తనని గేమ్ నుంచి ఎలిమినేట్ చేద్దామంటూ కొత్త రూల్ పెట్టింది. మరోవైపు సంజన టీం సభ్యులు దొంగతనం చేసిన డబ్బుని వెతుక్కునే పనిలో పడ్డారు. ఈ డిస్కషన్ మధ్యలో రెడ్ టీం, బ్లూ టీంకి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. గ్యాంగ్ లీడర్స్ సంజన, మాధురిలకు ఫుడ్ స్టాల్ నడిపించుకోవడానికి పానీ పూరి, టీ-స్టాల్ నడిపేందుకు అవకాశం ఇచ్చాడు. దీని ద్వారా టీం సభ్యుల నుంచి విలువైన సమాచారం అందుకోవచ్చు. ఎవరూ ఏ ఫుడ్ స్టాల్ తీసుకుంటారనే ఛాయిస్ గ్యాంగ్ లీడర్స్ కే ఇచ్చాడు.
తమ డబ్బు తీసుకున్నారని, ఇలా అయితే ఆట ఎలా ఆడాలి బిగ్ బాస్ మా డబ్బు ఇప్పించండి సంజన బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయడంతో ఇది మీ రెండు టీం మధ్య సమస్య మీరే తేల్చుకోవాలని చెప్పడంతో సంజన వెనక్కి తగ్గింది. అయితే ఇలా కామెంట్ తో దొంగతనం టాస్కలో భాగమని బిగ్ బాస్ చెప్పకనే చెప్పాడు. ఇలా ఈ ఫుడ్ స్టాల్స్ పేరుతో ఇంట్లో ఫుల్ హంగామా చేశారు. సభ్యుల నుంచి సమాచారం తీసుకునేందుకు మిగతా వాళ్లు పడ్డ పాట్లు అంత ఇంత కాదు. టైం చూసి ఇమ్మాన్యుయేల్, రీతూ, రాము రాథోడ్ లు సంజన టీంకి మారారు. మరోవైపు కచోరి ఆశపెట్టి సమన్ బుట్టలో వేసుకున్నాడు డిమోన్ పవన్. ఇక ఈ ఫుడ్ స్టాల్ ముగియడంతో అందరి గుట్టులు బయటపడ్డాయి.
కాసేపటి కోసమే సంజన టీం వెళ్లామని చెప్పి తిరిగి రీతూ, ఇమ్మాన్యుయేల్ లు మాధురిలో టీంలో చేరారు. ఆ తర్వాత డబ్బు సంపాదించుకునేందు బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ‘ధమాకా కిక్కు‘ పేరుతో కాలికి పని చెప్పాడు. కేవలం కాలితోనే వెల్ క్రో వాల్ పై చెప్పును పెట్టాల్సి ఉంటుంది. ఇరు టీం నుంచి ఐదుగురు మాత్రమే ఈ ఆట ఆడాలి. అలా సంజన టీం నుంచి రాము రాథోడ్, డిమోన్, గౌరవ్ అత్యంత హైట్ లో చెప్పు పెట్టాలని చూసి బొక్కబోర్లా పడ్డారు. వారు ఈ గేమ్ ని ఆడలేకపోయారు. మాధురి టీం నుంచి మొదట రీతూ వచ్చి 6 ఫీట్ పైనే చెప్పుని పెట్టి గెలిచింది. ఇక మాధురి టీంలో సాయి తప్ప అంత తమకు అందినంతలో వాల్ పై చెప్పి పెట్టి పాయింట్స్ తీసుకువచ్చారు.
అలా చివరికి బ్లూ టీం (సంజన గ్యాంగ్) కంటే రెడ్ టీం (మాధురి టీం) ఎక్కువ పాయింట్స్ తెచ్చుకుని ఈ టాస్క్ గెలిచి మరో రెండువేల బీబీ క్యాష్ గెలుచుకున్నారు. రూల్ ప్రకారం గెలిచిన టీం గ్యాంగ్ లీడర్ ని భుజాన ఎక్కించుకుని హౌజ్ మొత్తం తిప్పాలి. దీంతో ఈ టాస్క్ లో నెగ్గిన మాస్ మాధురిని సంజన టీం ఎత్తుకుని ఇళ్లంత తిప్పారు. ఆ తర్వాత ఓ సైడ్ కి కూర్చోని తనూజ.. మనీ షేర్ విషయం అసహనం చూపించింది. ఆడిన వాళ్లకి, పక్కన కూర్చోని చూసినవాళ్లకు కూడా ఒకే షేర్ ఏంటి అంటుంటే.. మనం ఫస్ట్ ఫెయిర్ గేమ్ ఆడట్లేదు..ముందు మన టీంలో యూనిటి రానివ్వు.. చివరికి నేను చూసుకుంటా? నీకే ఎక్కువ షేర్ ఇస్తా అంటూ నచ్చజెప్పింది మాధురి.