Rithu Chaudhary : బిగ్ బాస్ 9 లో ఉన్న హౌస్ మేట్స్ లో రీతూ చౌదరి పైన ఎవరికి పెద్దగా ఒపీనియన్ లేదు. కేవలం అవసరాల కోసమే రీతూ చాలామందిని వాడుకుంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా అడుక్కోవడం పనిగా పెట్టుకుంది. చాలా సందర్భాలలో అది బయటపడింది. నామినేషన్స్ లో ఉంటే సేవ్ చేయమని అడుక్కుంటుంది. టాస్క్ అయితే హెల్ప్ చేయమని అడుక్కుంటుంది. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
అయితే రీతుకి ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళు ఇప్పటివరకు హౌస్ లో ఎవరూ లేరు. కొంతమంది గొర్రెల్లాగా బుర్ర ఊపుతూ తనకి హెల్ప్ చేశారు. కానీ టైం వచ్చేసరికి మాటలు మార్చేయడం మొదలు పెడుతుంది రీతు చౌదరి. మొత్తానికి గౌరవ్ సూపర్ డెసిషన్ తీసుకున్నాడు.
బిగ్ బాస్ కంటెండర్ అవ్వడం కోసం డబ్బులు టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. హౌస్ లో అందరికంటే తక్కువ మనీ గౌరవ గుప్తా దగ్గర ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న రీతు గౌరవ గుప్తా దగ్గరకు వెళ్లి. నీ దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి కదా ఆ డబ్బులు నువ్వు నాకు ఇచ్చేస్తే నేను కంటెండర్ అవుతాను అని చెప్పింది.
గౌరవ్ గుప్తా నిర్మొహమాటంగా ఇప్పుడు ఇంకా గేమ్ ఫినిష్ అవ్వలేదు కదా అయిన తర్వాత చూద్దాం అని మొహం మీద చెప్పేశాడు. వెంటనే రీతు కూడా మొహం మార్చుకొని వెళ్ళిపోయింది. వెంటనే గౌరవ గుప్తా కూడా బిగ్ బాస్ తో మాట్లాడటం మొదలుపెట్టాడు. చూశారా బిగ్ బాస్ ఎలా ఆడుతున్నారో ఎవరు జెన్యూన్ గా లేరు అని అన్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గౌరవ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే గౌరవ కి పెద్దగా తెలుగు రాదు. తెలుగు నేర్పమని ఆయేషాకి కూడా చెప్పారు. గౌరవ్ ను మాటల్లో పెడితే తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేస్తాడు అనుకుంది రీతూ చౌదరి. బహుశా తనకి ఏమీ తెలియదు అని తక్కువ అంచనా వేసిందేమో.
అయితే గౌరవ మాత్రం చాలా తెలివిగా రీతూకి సమాధానం చెప్పాడు. ప్రస్తుతం గౌరవ్ తీసుకున్న డెసిషన్ మీద సోషల్ మీడియాలో కూడా విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. రీతుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది నెటిజెన్స్.
Also Read: Bigg Boss Thanuja : స్టార్ మా సీరియల్ బిడ్డ కాబట్టి తనుజ ను అంతలా లేపుతున్నారా? బిగ్ బాస్ చీకటి కోణం