Bigg Boss Thanuja : బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ను ఖచ్చితంగా ఆడియన్స్ మాత్రమే డిసైడ్ చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంతమందికి బిగ్ బాస్ యాజమాన్యం సపోర్ట్ చేస్తుంది అనిపిస్తుంది. ముఖ్యంగా తనుజ గురించి బిగ్ బాస్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు చాలా మందికి పలు అనుమానాలకి దారితీస్తుంది.
ఇప్పటివరకు జరిగిన ప్రతి నామినేషన్ లో కూడా తనుజ సేఫ్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా తనుజ పర్ఫామెన్స్ కూడా గేమ్స్ లో పెద్దగా కనిపించడం లేదు. కేవలం బాండింగ్స్ మాత్రమే నమ్ముకుని ఏడు వారాలు గడిపేసింది అనేది చాలామంది అభిప్రాయం. అయితే స్టార్ మా లో బిగ్ బాస్ షో వస్తుంది. బిగ్ బాస్ షోలో అందరూ సమానమే. అసలైన విన్నర్ ను ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు.
మొన్న జరిగిన నామినేషన్ లో రమ్య మాట్లాడుతూ నువ్వు అసలు గేమ్ ఆడటం లేదు. కేవలం బాండింగ్స్ నమ్ముకుని ఇక్కడ వరకు వచ్చేసావు. అసలైన గేమ్ బయటికి తియ్యు. నువ్వు ముసుగులో ఉన్నావు. నువ్వు ప్రతిసారి ఒక కొత్త బంధాన్ని వెతుక్కుంటున్నావు. అని కొంతమంది ఆడియన్స్ కి అనిపించిన పాయింట్ అన్నీ కూడా రమ్య మోక్ష ఓపెన్ గా చెప్పేసింది.
అయితే ఆ విషయంలో తనుజ రమ్య మోక్ష పైన ఫైర్ అయిపోయింది. వీరిద్దరికి మధ్య బీభత్సమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ తర్వాత రమ్యాను కూడా తనుజ నామినేట్ చేసింది. రమ్యాలోని లోపాలను ఎత్తి చూపించింది.
అయితే వీరిద్దరిలో ఎవరు కరెక్టు అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రముఖ ఛానల్ అయినా స్టార్ మా తనుజా మాట్లాడిన మాటలను మాత్రమే వీడియో కట్ చేసి తనను ఎలివేట్ చేశారు. తనుజ కోసం స్టార్ మా పి ఆర్ చేస్తున్నట్లు ఆ వీడియో చూస్తే అనిపిస్తుంది. కింద కామెంట్స్ లో కూడా చాలామంది నెటిజెన్స్ స్టార్ మా యాజమాన్యాన్ని తిడుతున్నారు.
Mass 🧨🔥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar pic.twitter.com/ll4K0gIqG2
— Starmaa (@StarMaa) October 22, 2025
తనుజ స్టార్ మా లో సీరియల్ చేయటం వలనే తనని ఆ విధంగా స్టార్ మా యాజమాన్యం లేపుతున్నారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అలానే తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమంది తనుజ హౌస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఎటువంటి కన్నింగ్ వేషాలు వేసింది అని స్పెషల్ గా వీడియోలు కూడా చేస్తున్నారు. కానీ ఒక యాజమాన్యం ఒక కంటెస్టెంట్ కి సపోర్ట్ గా అలాంటి వీడియో పెట్టడం అనేది మాత్రం దారుణమని చెప్పాలి.
Also Read: Madhuri Thanuja : రాజు అంటూనే మాధురికి నమ్మకద్రోహం చేస్తున్న తనుజ