Madhuri Fires on Thanuja: బిగ్ బాస్ హౌజ్ దొంగల హౌజ్గా మారింది. హౌజంత రచ్చ రచ్చగా మారింది. ఏడో వారం కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ఇచ్చాడు. ‘వాంటెడ్ పేట‘ పేరుతో కంటెస్టేంట్స్ని నేరస్థులుగా మార్చరు. ఈ నేరస్థులకు మాస్ మాధురి, సంజన సైలెన్సర్ గ్యాంగ్ లీడర్లు. అందరిని రెండు గ్యాంగులుగా విడదీసి వారికి టాస్క్ ఇచ్చాడు. ఇలా సంజన టీంలో నిఖిల్, గౌరవ్, రమ్య, డిమోన్ పవన్, శ్రీనివాస్ సాయి ఉన్నారు. మాధురి టీంలో తనూజ, రీతూ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ పడాల ఉన్నారు.
ఈ రెండు గ్యాంగ్ లు సమయానుసారంగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్ల్లో గెలిచి డబ్బులు గెలుచుకోవాలి. వాటిని టీం అంత పంచుకోవాలి. టీం సభ్యులు స్ట్రాటజీలు వాడి ఎక్కువ డబ్బులు తెచ్చుకునేలా తమ గేమ్ని ప్లాన్ చేయాలి. అలా ఏ టీంలో ఎక్కువ సభ్యులు ఉంటే ఆ టీం కంటెండర్ షిప్స్ అవుతారు. ఇందుకోసం పెట్టిన ఫస్ట్ లెవల్ టాస్క్ లో సంజన టీం గెలిచింది. ఓడిన టీం లీడరైన సంజనను స్విమ్మింగ్ ఫూల్ లో ముంచారు. ఇదంత జరుగుతున్న సమంయలో తనూజ తన గేమ్ స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంది. సుమన్ శెట్టితో కలిసి సంజన టీం డబ్బులు దొంగలించింది. అంత డబ్బులు విషయంలో గొడవ మొదలైంది.
డబ్బులు తీశావంటూ తనూజని తన టీం సభ్యులే టార్గెట్ చేస్తున్నారు. కానీ తను మాత్రం ఫుల్ స్ట్రాంగ్ నేను తియలేదు అని చెబుతుంది. తనూజ, సుమన్ డబ్బులు దొంగతనం చేసిన విషయం తెలిసిందే రీతూ.. వాటిని టీం అందరితో పంచుకోవాలని అంటుంది. దీంతో ఎందుకు చేస్తారాలా ఒకరు దొంగతనం చేసిన ఇవ్వడానికి వీలు లేదని తనూజ.. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దమే జరిగింది. ఇక టీం ఎందుకు.. ఎవరి గేమ్ వాళ్లు ఆడుకోండంటూ రీతూ తనూజపై అరిచింది. ఎందుకు అరుస్తున్నావ్ రీతూ తీసిపారేసింది తనూజ. దీంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుతూ అరుచకోవడంతో మధ్యలో మాధురి ఎంట్రీ ఇచ్చింది. ఇద్దరిని అదుపు చేసింది.
Now #DuvvadaMadhuri gave left and Right to Cheater #Thanuja 🤣
own team deggara endhuku ee mosaalu?🤡#NagarjunaAkkineni #BiggBoss9Telugupic.twitter.com/AG2TQNXmpP https://t.co/3C2b4rRpEI— DarshXplorer. (@diligentdarshan) October 22, 2025
ఆ తర్వాత డబ్బుల పంపకాల్లో మాధురి హార్ట్ అయ్యింది. ఒక్క టీం అయినప్పటి దొంగతనం చేసిన డబ్బు కూడా అందరిది అని, అవి అందరికి పంచాలని అంటుంది. దీనిని తనూజ ఖండించింది. నీ దగ్గర ఉన్న డబ్బులు అయితే పంచు.. కానీ, ఒకరు దొంగతనం చేసిన డబ్బులు నువ్వేలా పంచుతావని ప్రశ్నింది. దీంతో మాధురి తనూజపై ఫైర్ అయ్యింది. తను ఇలా మోసాలు, వెన్నుపోట్లు తీసుకోలేనంటూ హితబోధ చేసింది. ఇక ఆపు తనూజ.. నాకు ఇలాంటవన్ని చాలా చిరాకు. నేను నమ్మిన వాళ్లు నన్ను మోసం చేస్తే అసలు భరించలేను.. నీకు ఆట ముఖ్యమేమో కానీ, నాకు మనుషులు ముఖ్యమంటూ తనూజకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతుంది.
Also Read: Akira: ఏంటి పాప.. పవన్‌కు కోడలు అవ్వాలని చూస్తున్నావా.. అకీరాతోనే సరసాలు ఆడుతున్నావ్