Madhuri Thanuja : బిగ్ బాస్ సీజన్ 9, 7 వారంలోకి ఎంటర్ అయిపోయాం. అయితే రోజులు మారుతున్న కొద్దీ హౌస్మెట్స్ రంగులన్నీ బయటపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తనూజ విషయానికి వస్తే తను నటిస్తుంది అని చాలామందికి ఒక రకమైన అభిప్రాయం ఉంది. కానీ కొంతమంది తన ఫ్యాన్స్ మాత్రం మంచి గేమ్ ఆడుతుంది అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు.
తనుజ వళ్ళనే వరం భరణి ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్లిపోయాడు అని చాలామంది అభిప్రాయం ఇదే మాటను తనుజా దగ్గర చెప్తే ఒప్పుకోదు. భరణితో చాలా క్లోజ్ గా నాన్న నాన్న అంటూ కొంతకాలం పాటు ఉంది తనుజ. దువ్వాడ మాధురి వచ్చిన తర్వాత రాజు రాజు అంటూ తనకి బాగా క్లోజ్ అయిపోయింది. మరోవైపు నుంచి దువ్వాడ మాధురి కూడా తనుజాను బలంగా నమ్ముతుంది. వీరిద్దరి మధ్య గొడవ పడే అవకాశం ఉంది.
బిగ్ బాస్ డబ్బులకు సంబంధించి టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. తనూజ మాధురి దగ్గర డబ్బు దొంగతనం చేసినట్టు ఇంకా ఒప్పుకోలేదు. మాధురి తనూజని చాలా నమ్ముతుంది. నమ్మకద్రోహం భరించలేను. నా అనుకున్న వాళ్లు నన్ను మోసం చేస్తే అస్సలు తీసుకోను అంది. అయినా తనూజ ఎక్కడ డబ్బులు తీశాను అని ఒప్పకోలేదు.
మాధురి ఎన్ని సార్లు అడిగిన తీయలేదు ఉంటుంది తనుజ. సుమన్, దివ్యలు మాత్రం తీశామని ఒప్పుకున్నారు. కానీ, తనూజ తీయలేదు అనే అంటుంది. దీంతో మాధురి తనూజని నమ్ముతుంది. హౌజ్ లో అందరి కంటే ఎక్కువ తనూజనే మాధురి ఇష్టపడుతుంది.
మరి తనూజ దొంగతనం చేసినట్టు బయటపడ్డాక.. మాధురి రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి దూరం పెరిగే అవకాశం కూడా ఉంది. నమ్మకద్రోహం చేసిందని మాధురి తనూజని పక్కన పెట్టొచ్చు.
అయితే చివర్లో మాత్రం మాధురిని తనుజ పిలిచి. నువ్వు లీడర్, మనవాళ్లు ఏమంటున్నారంటే మన హెడ్ కు ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం రావట్లేదు అని. నాకు అన్ని పాయింట్లు తెలుసు కానీ గ్రూప్ డిస్టర్బ్ అవ్వకూడదు అని నేను ఏమీ అనట్లేదు అని మాధురి తనుజతో చెప్పింది. అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే రెండు రోజులు అయింది. వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా లేదు. అంటూ తనూజ జాగ్రత్త చెప్పింది.
మాధురి వచ్చిన రెండు రోజులు మాత్రం విపరీతంగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏదైనా విషయాన్ని గొడవలానే మాట్లాడేది. నాగార్జున ఆ విషయంలో మాట్లాడడం నేర్చుకోవాలి అని మాధురికి చెప్పారు. ఇప్పుడు మాధురి ఆట గమనిస్తుంటే ఖచ్చితంగా నాగార్జున చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంది అని అనిపిస్తుంది.
Also Read: Akhanda 2 : ఇండస్ట్రీలో ఆ నెంబర్ సెంటిమెంట్, అనౌన్స్ చేస్తున్నారు కానీ పాటించట్లేదు