BigTV English

Bigg Boss 9 Promo: మాధురికి ఝలక్ ఇచ్చిన ఇమ్ము… ఫైనల్‌గా తల్లీ కొడుకులు ఒక్కటైయ్యారు!

Bigg Boss 9 Promo: మాధురికి ఝలక్ ఇచ్చిన ఇమ్ము… ఫైనల్‌గా తల్లీ కొడుకులు ఒక్కటైయ్యారు!
Advertisement

Bigg Boss 9 Promo:బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. వైల్డ్ కార్డు ద్వారా మరో 7 మంది హౌస్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మధ్యలో దివ్య నిఖిత వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టగా.. ఆ తర్వాత ఐదవ వారం ఆరు మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత.. గేమ్ మరింత రసవత్తరంగా సాగుతోంది. అసలు స్వరూపాలు బయటపడినా.. ఎవరికి వారు తామే గొప్ప అనే రేంజ్ లో వ్యవహరిస్తున్నారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.


లేటెస్ట్ ప్రోమో రిలీజ్..

ఇదిలా ఉండగా.. తాజాగా బిగ్ బాస్ షోలో కంటెండర్ షిప్ కోసం ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో సంజనా, మాధురి ఇద్దరిని టీం లీడర్లుగా పెట్టి వాంటెడ్ పేట అనే పేరుతో ఓ టాస్క్ ఇచ్చి అందులో ఉన్న కంటెస్టెంట్లను రెండు గ్రూపులుగా చేసి వారికి క్యారెక్టర్ పేర్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు వీరికి మరో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగానే తాజాగా ఆ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 45వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని విడుదల చేయగా.. ఇందులో మాధురికి ఝలక్ ఇస్తూ.. ఇమ్మానుయేల్, సంజనా కలిసిపోయినట్లు చూపించారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

మాధురికి ఝలక్ ఇచ్చిన తల్లీకొడుకు..

బిగ్ బాస్ మాట్లాడుతూ.. వాంటెడ్ పేటలో మాస్ మాధురి.. సంజన సైలెన్సర్.. మీ ఇద్దరిలో ఒకరికి పానీ పూరి ధమాకా చాట్.. మరొకరికి కాఫీ స్టాల్ నడిపే అవకాశం లభిస్తుంది.మీ స్టాల్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. అంటూ బిగ్ బాస్ తెలిపారు. ఇంతలో సంజన మాట్లాడుతూ.. బిగ్ బాస్ నిన్న అన్ఫేర్ గా మా డబ్బు దొంగలించారు అంటూ చెప్పగా.. అది మీ రెండు టీముల సమస్య మీరే సాల్వ్ చేసుకోవాలి అంటూ బిగ్ బాస్ తెలివిగా తప్పించుకున్నారు. పానీ పూరి స్టాల్ ను సంజన.. చాయ్ స్టాల్ ను మాధురి నడిపారు. సంజన పానీ పూరి దగ్గర తింటూ ఉంటే మాధురితో అమ్మడానికి పెట్టుకుందా.. తినడానికి పెట్టుకుందా.. అంటూ కామెంట్ చేశారు ఇమ్ము. ఆ తర్వాత సంజనా దగ్గరికి వచ్చి పానీపూరి తినడానికి అడుగుతుండగా.. నేనేమీ అమ్మను కాదు.. పప్పను కాదు.. ఇక్కడ నుంచి పో అంటూ సంజన చెబుతుంది..ఆ తర్వాత మాధురి వచ్చి ఇమ్ము ఇక్కడే ఉంటావా లేదా నా దగ్గరికి వస్తావా.. ఒకవేళ ఉండాలి అనుకుంటే ఇక్కడే ఉండిపో అంటూ చెబుతుంది. ఇక రమ్య వచ్చి సంజన టీం కి సంబంధించిన బ్లూ టాగ్ ను ఇమ్మానుయేల్ చేతికి కట్టేసింది. ఇక ఇమ్మానియేల్ మాట్లాడుతూ ఈరోజు గెలిచేది సంజననే అంటూ మాధురికి జలక్ ఇచ్చారు. అలా మొత్తానికి అయితే ప్రోమో కాస్త నవ్వులతో సాగింది.


ALSO READ: Vash level 2: ఓటీటీలోకి వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే?

Related News

Venu Swamy-Bigg Boss 9: బిగ్‌ బాస్‌ బ్యాన్‌.. బాగా కాలుతున్నట్టుంది.. వేణుస్వామి సంచలన కామెంట్స్‌

Madhuri-Thanija: ఇక ఆపు.. నేను భరించలేను.. తనూజకు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చిపడేసిన మాధురి

Bigg Boss: TVR రేటింగ్ లో బిగ్ బాస్ కి ఏ భాషలో ఏ స్థానం అంటే?

Bigg Boss 9 Promo: అందరూ దొంగలే.. దోచుకోవడవమే లక్ష్యం!

Bigg Boss 9: హౌజ్ లో కరుడు గట్టిన నేరస్థులు.. ఆనందంలో చిందులేసిన మాస్ మాధురి

Bigg Boss 9 Highlghts: ఆయేషా సేఫ్ వెనక పెద్ద కుట్ర.. గౌరవ్ తో మ్యాచ్ ఫిక్సింగ్.. ఇమ్మూ ఇంత కథ నడిపించాడా

Emmanuel : దువ్వాడ మాధురి కే వెన్నుపోటు పొడిచే ప్లాన్, ఇమ్మానియేల్ మామూలోడు కాదు

Big Stories

×