Telusukada: సిద్దు జొన్నలగడ్డ(siddu Jonnalagadda) హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తెలుసు కదా (Telusukada). కాస్ట్యూమ్ డైరెక్టర్ నీరజ కోన (Neeraja Kona) దర్శకురాలిగా మారి తెరుకెక్కించిన మొట్టమొదటి చిత్రం. ఇలా లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, రాశిఖన్నా (Rashi Khana), శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సినిమా కార్యక్రమానికి పలువురు దర్శకనిర్మాతలు హాజరై సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా అవకాశం కల్పించినందుకు నీరజ కంటే ముందుగా హీరో నితిన్ (Nithin)కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలని సిద్దు జొన్నలగడ్డ వెల్లడించారు. తెలుసు కదా సినిమాకు ఫస్ట్ ఛాయిస్ తాను కాదని, నీరజ ఈ కథతో నితిన్ వద్దకు వెళ్లిందని సిద్దు తెలిపారు. ఈ కథ మొత్తం విన్న నితిన్ ఒకరోజు రాత్రి తనకు ఫోన్ చేసి ఇలా ఒక కథ ఉంది అది నువ్వు వినాలి, అది నీకైతేనే కరెక్ట్ గా సరిపోతుందని చెప్పారు. అలా నితిన్ అన్న వద్దకు వెళ్ళిన ఈ కథ ఆయన రిజెక్ట్ చేస్తేనే నా వరకు వచ్చిందని ఈ విషయంలో నితిన్ అన్నకు తాను ముందుగా థాంక్స్ చెప్పాలని సిద్దు జొన్నలగడ్డ వెల్లడించారు.
ఇలా ఈ సినిమాకు మొదటి హీరో సిద్దు కాదని నితిన్ అనే విషయం తెలియడంతో అభిమానులు ఒక్క సారిగా షాక్ అవుతున్నారు. నితిన్ ఇలాంటి ఒక మంచి సినిమాని చేతులారా మిస్ చేసుకున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.. ఇటీవల కాలంలో నితిన్ వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటూ ఎంతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయనకు ఒక హిట్టు పడితే తప్ప తన కెరియర్ ముందుకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి తరుణంలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఎల్లమ్మ చాన్స్ కోల్పోయిన నితిన్..
ఇటీవల కాలంలో నితిన్ నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈయన దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా సక్సెస్ కానీ నేపథ్యంలో ఎల్లమ్మ సినిమా నుంచి కూడా నితిన్ తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నితిన్ ఇటీవల కాలంలో సక్సెస్ సినిమా చూసి చాలా సంవత్సరాల అవుతుందని చెప్పాలి.
Also Read: Conistable Kanakam: ఫ్రీగా సినిమా చూడండి.. ఐఫోన్ గెలుచుకోండి ..బంపర్ ఆఫర్ ఇచిన మూవీ టీమ్!