PAK vs SA: పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా ( Pakistan vs South Africa, 2nd Test)మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ వన్డే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan) వివాదంలో చిక్కుకున్నాడు. తన బలుపుతో స్టంప్‌లను బ్యాట్ తో బాదేశాడు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టులో మూడవరోజు ఇవాళ్టితో ముగిసింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తన బ్యాట్ తో స్టంప్స్ పడగొట్టాడు మహమ్మద్ రిజ్వాన్. దీంతో వెంటనే దక్షిణాఫ్రికా ప్లేయర్లు అప్రీల్ చేశారు. మహమ్మద్ రిజ్వాన్ ఔట్ అంటూ స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మూడవరోజు ముగిసిన తర్వాత, తన బ్యాట్ తో స్టంప్స్ పడగొట్టాడని మహమ్మద్ రిజ్వాన్ విషయంలో దక్షిణాఫ్రికా అప్పీల్ కు వెళ్ళింది. అయితే ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా ప్లేయర్లకు షాక్ ఇస్తూ, అది నాటౌట్ అంటూ తిరస్కరించేశాడు ఫీల్డ్ అంపైర్. దీంతో మహమ్మద్ రిజ్వాన్ ఊపిరి పీల్చుకున్నాడు. మూడవరోజు ఆట ముగిసిందని ప్రకటించిన తర్వాతే, స్టంప్స్ పడగొట్టాడని.. మ్యాచ్ కంటే ముందు ఇలాంటి సంఘటన జరిగితే మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan) ఔట్ అయ్యేవాడని అంటున్నారు. అందుకే నాటౌట్ అంటూ.. అంపైర్ సరైన నిర్ణయం తీసుకున్నాడని వెల్లడిస్తున్నారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత స్టంప్స్ ను బ్యాట్ తో కొడితే ఎలాంటి సమస్య ఉండేదని ఐసీసీ రూల్స్ కూడా చెబుతున్నాయి. దీంతో ఎప్పటి లాగానే, ఈ మ్యాచ్ 4వ రోజున మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తాడన్న మాట.
ఇది ఇలా ఉండగా రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. 35 ఓవర్లు ఆడిన పాకిస్తాన్ నాలుగు వికెట్లు నష్టపోయి 94 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాకిస్తాన్ 23 పరుగుల లీడ్ సంపాదించింది. ప్రస్తుతం బాబర్ ఆజం 49 పరుగులు, మహమ్మద్ రిజ్వాన్ 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 333 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దక్షిణాఫ్రికా 404 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలింది.
పాకిస్తాన్ జట్టులో సమూల మార్పులు చేస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగానే మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ కు కీలక పదవి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉస్మాన్ వహాల స్థానంలో మిస్బా ఉల్ హక్ కు పదవి ఇవ్వనున్నారు. పాకిస్తాన్ బోర్డులో అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్ డైరెక్టర్ గా మిస్బా ఉల్ హక్ కు పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆ పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని పిసిబి చైర్మన్ నఖ్వీ ఒప్పించడం జరిగింది.
#ICYMI: Mohammad Rizwan dislodged the stumps with his bat after the last ball of Day 3, and South Africa appealed eagerly, but the umpire turned it down.
What's your take on this?
📸: Sports TV/YT#PAKvsSA #MohammadRizwan pic.twitter.com/k8F8LkBad5
— CricTracker (@Cricketracker) October 22, 2025