Shubman Gill: టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill ) వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల కాలంలో ఉన్నత శిఖరాలకు ఎదిగిన శుభమాన్ గిల్.. ఓ అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. అడిలైడ్ వేదికగా రేపు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( IND Vs AUS Series ) మధ్య వన్డే మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. విమానాశ్రయంలో మెరిశాడు శుభమాన్ గిల్. అయితే ఈ సందర్భంగా కొంత మంది అభిమానులు గిల్ తో సెల్ఫీల దిగారు. కొందరు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మరికొందరు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అందులో పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ ఆగంతకుడు కూడా ఉన్నాడు. అందరిలాగే వచ్చి, గిల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు పాక్ ఫ్యాన్. అతను ఎవరో తెలియక, శుభమాన్ గిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇక్కడే వివాదంలో చిక్కుకున్నాడు గిల్.
టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill ) కు విమానాశ్రయంలో షేక్ హ్యాండ్ ఇచ్చింది పాకిస్తాన్ దేశస్థుడు. ఈ తరుణంలోనే, శుభమాన్ గిల్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత పాకిస్తాన్ జిందాబాద్ ( Pakistan Zindabad) అంటూ సదరు అభిమాని నినాదాలు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ అభిమానికి షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చావు ? అని గిల్ ను ఆడుకుంటున్నారు. టీమిండియా కెప్టెన్ కాగానే, నీకు బలుపు బాగా పెరిగిపోయిందని చురకలు అంటిస్తున్నారు. నీకు కొంచెం కూడా సిగ్గు లేదు అంటున్నారు. ఆసియా కప్ లో సూర్య కుమార్ ఎలా వ్యవహరించాడు..? ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్? అంటూ నిలదీస్తున్నారు ఇండియన్స్.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సమయంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ల సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పాకిస్తాన్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు వచ్చినా కూడా మొహమాటం లేకుండా.. షేక్ హ్యాండ్ ఇవ్వనని తేల్చి చెప్పేశాడు. టాస్ సమయంలో అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా పాకిస్తాన్ ప్లేయర్లను అవమానించాడు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల దాడికి దాదాపు 18 మంది ఇండియాకు చెందిన టూరిస్టులు మరణించారు. దీంతో పాకిస్తాన్ పై అటాక్ చేసింది ఇండియా. అంతేకాదు మొత్తం 100 మంది ఉగ్రవాదులను చంపేసింది. అప్పటి నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య కుమార్ యాదవ్. కానీ గిల్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడంపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను పాక్ వ్యక్తి అని తెలిసి ఉంటే, గిల్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోయేవాడని అంటున్నారు.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
A Pakistani fan met Shubman Gill in Adelaide and said, "Pakistan Zindabad." pic.twitter.com/sfoqpeLOi0
— Sheri. (@CallMeSheri1_) October 22, 2025