Bigg Boss 9: తాజాగా బిగ్ బాస్ 52వ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఈసారి ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు రాకపోయినప్పటికీ కామనర్స్ దుమ్ము దులుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయిన ఇద్దరు కంటెస్టెంట్లు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. అలా భరణి, దమ్ము శ్రీజ ఇద్దరి ఎంట్రీ తో హౌస్ లో మళ్ళీ రచ్చ మొదలైంది. ఫస్ట్ టైం హౌస్ లోకి వచ్చినప్పుడు భరణి కాస్త సైలెంట్ గా ఉన్నప్పటికీ ఎలిమినేట్ అయి హౌస్ లోకి వచ్చాక మాత్రం తన జోరు చూపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ తో వచ్చిన భరణి , శ్రీజలకు మరో షాకిచ్చారు బిగ్ బాస్..
రీ ఎంట్రీ ద్వారా వచ్చిన మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారని.. ఎవరు ఉంటారో మీ ఆటతో తేలిపోతుంది అని వారికి ఒక టాస్క్ ఇచ్చారు. అలా టాస్క్ లో శ్రీజ వర్సెస్ భరణి లు హౌస్ లోని చెరో ఆరుగురు కంటెస్టెంట్లతో రెండు టీంలుగా విడిపోయారు. అలా మొదట కొన్ని బ్లాక్స్ ఇచ్చి వాటితో ఒక స్క్వేర్ బాక్స్ లో టవర్ కట్టాలని చెప్పారు. కానీ ఆ టవర్ ని ఆపోజిట్ వాళ్లు కూల్చేయవచ్చు. అలా ఒకరి టవర్ ని మరొకరు కూల్చేయవచ్చు.కానీ బజర్ మోగేలోపు ఆ స్క్వేర్ బాక్స్ లో ఎవరి టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో వారే విన్నర్ అని తెలిపారు. ఇక టాస్క్ స్టార్ట్ అవ్వడంతోనే రెండు టీంలు చాలా రసవత్తరంగా గేమ్ ఆడాయి. కానీ బజర్ మోగాక సంచాలక్ అయినటువంటి సుమన్ శెట్టి భరణి టీం విన్ అయిందని చెప్పారు.కానీ సంచాలక్ మాటల్ని శ్రీజ టీం పట్టించుకోరు అరుస్తారు.. ఇక ఈ టాస్క్ జరుగుతున్నంతసేపు రెండు టీం లు కొట్టుకున్నంత పని చేశాయి.
also read:Thalavara OTT: బొల్లి వ్యాధితో బాధపడే హీరో.. అవమానాలు.. ఛీత్కారాలు.. కట్ చేస్తే!
అయితే ఈ టాస్క్ ఇచ్చే ముందే బిగ్ బాస్ టాస్క్ లో గెలిచిన వాళ్ళు మాత్రమే హౌస్ లో ఉంటారని, మిగిలిన వారు హౌస్ నుండి బయటకు వెళ్తారని క్లారిటీ ఇచ్చారు. కానీ అలా ఏమి జరగడంలేదని తెలుస్తోంది. హౌస్ లో భరణి, శ్రీజ ఇద్దరు ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ టాస్క్ లో ఓడిపోయిన శ్రీజని బయటికి పంపిస్తే.. మళ్లీ షోపై నెగిటివిటీ రావడంతో పాటు ఎవ్వరూ అంతగా చూడరు. ఇప్పటికే శ్రీజ ఎంట్రీ ఇవ్వడంతోనే మాధురితో గొడవ పెట్టుకుంది. అలా వీరిద్దరి మధ్య హౌస్ లో రసవత్తరమైన పోరు ఉంటుందని మొదట్లోనే అర్థమైంది.
ఇక గొడవలు ఉంటేనే బిగ్ బాస్ ని చాలా మంది చూస్తారు. అలాంటప్పుడు శ్రీజని బయటికి పంపించి మళ్లీ టిఆర్పి రేటింగ్ తగ్గించుకోవడం బిగ్ బాస్ కి కూడా ఇష్టం ఉండదు కదా.. అందుకే చివర్లో ఇద్దరినీ హౌస్ లోనే ఉంచేస్తున్నట్టు బిగ్ బాస్ చెబుతారట. అలా టాస్క్ లో విన్ అయిన వాళ్లు మాత్రమే హౌస్ లో ఉంటారని చెప్పి చివరికి ఇద్దరికీ హౌస్ లో స్థానం ఉంది అని బిగ్ బాస్ మరో షాకిస్తారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ దమ్ము శ్రీజ లాంటి మంచి స్ట్రాంగ్ ప్లేయర్ ని హౌస్ నుండి పంపేయడం ఇష్టం లేకే బిగ్ బాస్ చివర్లో తన నిర్ణయాన్ని మార్చుకొని శ్రీజ కూడా హౌస్ లోనే కొనసాగుతుందని ట్విస్ట్ ఇస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఫుల్ ఎపిసోడ్ చూస్తే గానీ తెలియదు బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు అనేది.