Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ వినూత్నమైన వినోదాలతో అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మొత్తం 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే వీరంతా కూడా అగ్ని పరీక్ష అనే మినీ షోలో అక్కడ పెట్టే టాస్క్ లు అన్నింటిని గెలిచి సత్తా చాటి ఇప్పుడు హౌస్ లోకి వచ్చారు. ఇక మధ్యలో దివ్యా నికిత అనే కామనర్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టింది. ఇక రీఎంట్రీలో భాగంగా మొత్తం ఆరు మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇదంతా బాగానే ఉన్నా మొత్తం 7 వారాలకు గాను ఎనిమిది మంది హౌస్ మేట్స్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎనిమిదవ వారం కొనసాగుతోంది. అయితే ఈ వారం మాజీ హౌస్ మేట్స్ లో ఒకరికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అందులో భాగంగానే నిన్నటి ఎపిసోడ్లో భరణి శంకర్, దమ్ము శ్రీజ హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే పర్మినెంట్ హౌస్ మేట్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తానని.. కాకపోతే గేమ్స్ ఆడి ఎవరు విన్ అయితే వారికే హౌస్ లో అవకాశం లభిస్తుందని తెలిపారు. అందులో బాగానే తాజాగా ప్రోమో విడుదల చేయగా.. ఈ ప్రోమోలో రీ ఎంట్రీ గోల ఎలా ఉందంటే చూసేవారికి చిరాకు దొబ్బుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
52వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో మొదలవ్వగానే.. భరణి, శ్రీజ.. ఈరోజు మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు.. కానీ హౌస్ లో పర్మినెంట్ హౌస్ మేట్ గా ఒకరికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. పర్మనెంట్ హౌస్ మేట్ గా మారాలనుకుంటున్న సభ్యులు.. అందుకోసం మీరు ఇంట్లో ఉన్న సభ్యులలో కొందరిని మీ సైనికులుగా ఎంపిక చేసుకోవాలి. అంటూ చెప్పారు బిగ్ బాస్. ఇక ఇద్దరూ కూడా తమ సైనికులను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు.
ఇకపోతే శ్రీజ, భరణి రెండు టీం లను ఎంచుకున్నారు. అందులో బిగ్ బాస్ మాట్లాడుతూ..” మీకు ఇచ్చే మొదటి టాస్క్ గట్టు పడగొట్టు.. తమకు ఇచ్చిన బ్లాక్సుతో ఒక స్క్వేర్ బాక్సులు ఏడంతస్తుల టవర్ నిర్మించాలి. ప్రత్యర్థి ఈ టవర్ ను పడగొట్టాలి. ఎండ్ బజర్ మోగే సమయానికి ఏ టీం టవర్ అయితే ఎక్కువ ఎత్తు ఉంటుందో ఆ టీం ఆ రౌండ్ విజేత అవుతుంది అంటూ టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్. ఇక మొత్తం ఆరు మంది రెండు టీములుగా విడిపోయి.. ఈ టాస్క్ ఆర్డర్ కానీ చివర్లో వీరు మాట్లాడే మాటలు చూసే వారికి నిజంగా చిరాకు దొబ్బించాయని చెప్పవచ్చు. ఒకరికొకరు అరుచుకోవడాలు.. మీద పడడాలు.. గొడవపడడాలు.. చూసే వారికి చిరాకు దొబ్బి.. అందరికీ ఏంట్రా ఈ కర్మ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే భరణి టీం గెలిచింది కానీ దీనిని శ్రీజ ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత సంచాలక్ గా ఉన్న సుమన్ కూడా బ్లూ టీం గెలిచింది అంటూ తన నిర్ణయం తెలిపారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
also read:Rashmika: అప్పుడే పిల్లల కోసం ఎదురుచూస్తున్న రష్మిక.. తొందరెందుకమ్మా!