Bigg Boss 9 Promo 2: ప్రస్తుతం బిగ్ బాస్ 52వ రోజుకు చేరుకుంది. తొమ్మిదో వారం నామినేషన ప్రక్రియ ముగిసింది. ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ రీఎంట్రీ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరితో నామినేషన్ ప్రక్రియ జరిపించి చివరకు ఇద్దరికి మాత్రమే రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఇచ్చారు. అందులో ఒక్కరే పర్మినెంట్ హౌజ్ మేట్ అవుతారని చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు. నేటి ఎపిసోడ్ వారి రీఎంట్రీకి టాస్క్ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రొమోలను బిగ్ బాస్ వరుసగా రిలీజ్ చేస్తుంది. మొదటి ప్రొమో రీఎంట్రీ శ్రీజ, భరణిలు కూడా సిద్దమైనట్టు చూపించారు. ఇందుకోసం వారికి పెట్టిన టాస్క్ లు జరిగింది.
నిన్న ఈ ఇద్దరిలో ఒక్కరు హౌజ్ లో ఉండాలంటే వారికి రెండు టాస్క్ లు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఫస్ట్ రౌండ్ లో హౌజ్ ఉండాలని అనుకునేవారికి సపోర్టు ఇస్తూ వారు మార్చుకునే విషయాలను చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించారు. మాధురి, ఇమ్మాన్యుయేల్, డిమోన్ పవన్ తప్ప మిగతవారంత భరణికే సపోర్టు ఇచ్చారు. ఈ రోజు వారికి రెండో టాస్క్ జరగనుంది. రీఎంట్రీ అని అనుకుంట బిగ్ బాస్ ఈసారి గట్టి టాస్క్ ప్లాన్ చేశాడు. భరణి, శ్రీజకు మధ్య జరిగే ఈ టాస్క్ లో మిగతా వారి సపోర్టు తప్పనిసరి చేశాడు. ఒక్కక్కొరికి హౌజ్ లోని వారు ఇద్దరు సపోర్టు చేయాలి. వారి సాయంతో శ్రీజ, భరణిలు వారి ఇచ్చిన షీట్స్ టవర్ ని పేర్చాలి. అయితే వారి సపోర్టు ఉన్నావరు మరోకరి టవర్ పడగొట్టొచ్చు.
అదే టైంలో వారిని ఆపుతూ తమ టవర్ ని కాపాడుకోవాలి. దీనికి సంచాలక్ గా సుమన్ శెట్టి, కళ్యాణ్ లు ఉన్నారు. ఈ టాస్క్ లో శ్రీజకు డిమోన్, గౌరవ్ సపోర్టు చేయగా.. నిఖిల్, ఇమ్మాన్యుయేల్ భరణికి సపోర్టు ఇచ్చారు. ఒకరిని ఒకరు ఆపే క్రమంలో ఈ టాస్క్ లోఫుల్ ఫిజికల్ అయ్యారు. అయితే బజర్ మోగే సమయానికి భరణి కంటే శ్రీజ టవర్ ఎక్కువ ఉంది. కానీ, అది బ్లూ బాక్స్ లో లేదు. ఈ టాస్క్ లో విన్నర్ ఎవరో తేల్చడంలో సంచాలక్ లు తడబడ్డారు. టవర్ షీట్ ఒక్కటి బ్లూ బాక్స్ లో ఉందని భరణినే విన్నర్ అని సుమన్, బ్లూ బాక్స్ లో కంప్లసరీ ఉండాలనే రూల్ లేదు కాబట్టి, టవర్ పెద్దగా ఉన్న శ్రీజనే విన్నర్ కళ్యాణ్ మధ్య ఆర్గ్యూ జరిగింది. ఈ విషయంలో ఇద్దరు తగ్గేలే లే అని ఉండటంతో బిగ్ బాస్ సంచాలక్ ని మార్చుకునే హక్కుని శ్రీజ, భరణిలకే ఇచ్చాడు.
దీంతో శ్రీజ నేను మాధురి గారిని ఎంచుకుంటాను అనడంతో మాధురి వచ్చిన శ్రీజ విన్నర్ అని తేల్చింది. భరణి టవర్ లేదు కానీ, ఒకటి బ్లూ బాక్స్ లో ఉంది. శ్రీజ టవర్ పెద్దగా ఉంది కానీ, అది టార్గెట్ ప్లేస్ లో లేదు. అయితే ఇది రూల్ లేదు కాబట్టి శ్రీజని విన్నర్ గా ప్రకటిస్తున్నట్టు చెప్పింది. ఇక టాస్క్ జరుగుతుండగా కంటెస్టెంట్స్ ఫుల్ ఫిజికల్ అయ్యారు. కంటెస్టెంట్స్ మధ్య విపరీతమైన తొపులాట జరగడంతో అందరికి దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. ఈ తొపులాటలో భరణి నేరుగా వెళ్లి స్విమ్మింగ్ ఫూల్ లో పడ్డారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. నొప్పితో బాధపడుతున్న ఆయనను మెడికల్ రూంకి తీసుకువెళ్లారు. డాక్టర్ వచ్చి చెక్ చేయగా.. భరణి ఆస్పత్రికి వెళ్లడం అత్యవసరం అని సూచించారు. దీంతో మెయిన్ గేట్ నుంచి భరణి ఆస్పత్రికి వెళ్లడం చూపించారు.