Salman Khan: బిగ్ బాస్(Bigg Boss) రియాలిటీ షో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికీ ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదవ సీజన్ ప్రసారమవుతుంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఈ కార్యక్రమం ఏకంగా 19వ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. హిందీలో ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇకపోతే ఈ హిందీ కార్యక్రమానికి హోస్టుగా సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమం ప్రసారమైనప్పటి నుంచి ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ మాత్రమే హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే 19వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ (Remuneration) గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి. ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడం కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 200 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ కార్యక్రమానికి 200 కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిర్మాత రిషి నెగి(Rishi Negi) స్పందిస్తూ సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బిగ్ బాస్ షో నిర్మాత రిషి నెగి మాట్లాడుతూ.. బిగ్ బాస్ కార్యక్రమం కోసం రెమ్యూనరేషన్ ఎంతైనా అందుకు సల్మాన్ ఖాన్ పూర్తిస్థాయిలో అర్హుడని తెలిపారు. ఈయన రెమ్యూనరేషన్ కి సంబంధించిన వివరాలను నేను బయట పెట్టొచ్చు కానీ సల్మాన్ ఖాన్ అలాగే జియో హాట్ మధ్య ఒప్పందం ఉన్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ వివరాలను తాను బయట పెట్టలేకపోతున్నానని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంతో సల్మాన్ ఖాన్ గారు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని నిర్మాత రిషి వెల్లడించారు.
అది మా అదృష్టం..
గతంలో ఎన్నో సందర్భాలలో సల్మాన్ ఖాన్ గారు ఈ కార్యక్రమానికి తాను హోస్టుగా వ్యవహరించనని తాను తప్పుకుంటున్నానని వెల్లడించారు. కానీ మళ్లీ ఈయనే ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తుండడం నిజంగా మా అదృష్టం అంటూ నిర్మాత వెల్లడించారు. ఇలా సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ గురించి నిర్మాత రిషి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎంతైనా అందుకు సల్మాన్ ఖాన్ అర్హుడని చెప్పడంతో కచ్చితంగా ఈయన ఈ కార్యక్రమం కోసం 200 కోట్ల రూపాయలు అందుకుంటున్నారని అందుకే నిర్మాత అర్హుడు అంటూ సమాధానం చెప్పారని పలువురు భావిస్తున్నారు. ఇక బిగ్ బాస్ హిందీ సీజన్ 19 కార్యక్రమం ఈ ఏడాది ఆగస్టు 24 వ తేదీ ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.
Also Read: Raviteja : నా తుదిశ్వాస అక్కడే జరగాలి.. ఎమోషనల్ అయిన రవితేజ!