Bigg Boss 9 Promo : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతుంది. ఈరోజు గొడవ పడిన వాళ్ళు రేపటికి కలిసిపోతున్నారు. ఈరోజు ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు రేపటికి ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు. బిగ్ బాస్ లో మంచి స్ట్రాటజీ నడుస్తుంది. ఈ క్షణం ఒకరి పైన ఒకరు అరుచుకున్న వాళ్లే మరుక్షణం దగ్గర దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
అయితే బిగ్బాస్ సీజన్ లో ఒక లవ్ ట్రాక్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటిరోజు రీతు చౌదరి కళ్యాణ్ ఒకరి కళ్ళల్లోకి ఒకరు తీక్షనంగా చూసుకున్నారు. ఆ వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ వీడియో చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు మరీ కరువులో ఉన్నట్లు ఉన్నారు.
రీసెంట్ గా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో రీతు చౌదరి హైలెట్. ఒకవైపు కళ్యాణ్ ని చూస్తూ ఇంప్రెస్ అయిపోయినట్లు డైలాగ్స్ వేసింది. కళ్యాణ్ ఎక్సర్సైజ్ చేస్తున్న తరుణంలో రీతూ చౌదరి మాట్లాడుతూ కళ్యాణ్ ను ఫ్లర్ట్ చేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటి తర్వాత డిమాన్ పవన్ కి గోరుముద్దలు తినిపించింది. ఒక ప్రోమో లోనే రెండు వేరియేషన్స్ బిగ్ బాస్ చూపించారు.
దీనిని బట్టి రీతూ చౌదరి తో పాటు కామనర్స్ కూడా కరువు లో ఉన్నారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రోమో మొదలైనప్పుడు మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ వేశారు. ప్రోమో ఎండ్ కి వచ్చినప్పుడు రాధిక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేశారు. దీనితో చాలామంది ఈవిడ రీతు కాదు రాధిక అని క్లారిటీ వచ్చింది. రాధిక అనే పేరుకు డిజె టిల్లు సినిమా ద్వారా ఒక బ్రాండ్ పడిపోయింది. ఇక రీతుకు ఇలాంటి విషయాలు ఏవి కొత్త కాదు. గతంలో సరిగమప యశస్వి, అలానే హైపర్ ఆది మధ్య కూడా స్క్రిప్స్ లో భాగంగా చాలా స్టోరీస్ నడిపింది.
Also Read : Mahesh Babu : ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి మహేష్ బాబు ఓపెన్ రిక్వెస్ట్ , ఇక్కడితో అంతా అయిపోయినట్టే