Mahesh Babu : కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మామూలుగా విడుదలై భారీ విజయాలు అందుకుంటాయి. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ ను అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో మౌళి , శివాని నాగారం నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా విడుదలైనప్పుడు నుంచి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది.
కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఒక సినిమా బాగుంది అంటే సెలబ్రిటీలు కూడా వరుసగా ట్వీట్లు వేస్తూ ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి చాలా మంది ట్వీట్లు వేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అయితే ఈ సినిమా దర్శకుడు సాయి మార్తాండ్ మరియు మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి వీరాభిమానులు.
సింజిత్ సంగీత దర్శకుడుగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ సిన్జిత్ కంపోస్ట్ చేసిన లిటిల్ హార్ట్స్ పాటలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విషయంలో సింజిత్ తాను చాలా హ్యాపీగా ఉన్నాను అని కూడా చెప్పాడు. అయితే ఈ సినిమా గురించి చాలామంది సెలబ్రిటీలు ట్వీట్స్ వేసినందుకు హ్యాపీగా ఉంది. నేను మాత్రం ఒక ట్వీట్ కోసం ఎదురు చూస్తున్నాను ఆ ట్వీట్ వచ్చేస్తే చాలు ఒక వన్ వీక్ ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని సింజిత్ చెప్పాడు.
అటు ఇటు మరి ఎవరిదో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబుది. సింజిత్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి వీరాభిమాని. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ బాబు సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన చాలామంది అభిమానుల్లో సింజిత్ కూడా ఒకడు. మొత్తానికి ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు చూశారు. ముఖ్యంగా సింగ్ కి మహేష్ బాబు ఒకటి చెప్పారు. నీ నుంచి చాలా పని ఉంది దయచేసి మీరు ఫోన్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళదు బ్రదర్ అని సింజిత్ మాటలకే కౌంటర్ ఇచ్చాడు మహేష్ బాబు.
#Littlehearts….fun, fresh and big in ❤️❤️❤️the cast is extraordinary…. Especially the young ones.. phew !!! sensatiional acting😍😍😍What a joy ride!!! @SinjithYerramil Nuvvu daya chesi phone aapesi yekkadiki vellodhu brother…. It’s going to be really busy for a…
— Mahesh Babu (@urstrulyMahesh) September 16, 2025
చిత్ర యూనిట్ అంతా కూడా ఈ ఒక్క ట్వీట్ కోసమే ఎదురు చూశారు. మొత్తానికి మహేష్ బాబు కూడా లిటిల్ హార్ట్స్ సినిమా గురించి ట్వీట్ వేసేసారు. ఇక్కడితో సినిమా యూనిట్ సెలబ్రేషన్ అండ్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుమించి హై వీళ్లకు మళ్ళీ రాదు. నేను ఎక్కడికి వెళ్ళను అన్న అంటూ సింగ్జిత్ రియాక్ట్ అయ్యాడు.
NENU INKA YEKKADIKI VELLANU ANNA @urstrulyMahesh 😭😭😭😭😭😭❤️❤️❤️💥💥💥💥💥 https://t.co/KcVcyVHwMK pic.twitter.com/eTH3pOQl0d
— SinjithYerramilli (@SinjithYerramil) September 16, 2025
Also Read: Bigg Boss 9 : దమ్ముంటే బిగ్ బాస్ ని అడగండి, ఆడవాళ్ళందరూ కలిసి మాస్క్ మెన్ పై రెచ్చిపోయారు