Hyderabad: హైదరాబాద్ నగరంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళను చంపి ఏకంగా రైల్వే ప్లాట్ ఫామ్ పై పడేశారు. గుర్తుతెలియని దుండగులు ఓ మహిళను చంపి, మృతదేహాన్ని సంచిలో కట్టారు. ఆ తర్వాత ఆటోలో ఆ సంచిని తీసుకొని వచ్చి చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై పడేశారు. రక్తంతో తడిచిన ఆ సంచిని చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంచిలో శవాన్ని చూసి షాకయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మహిళ వయసు 30 నుంచి 40 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. ఘటన స్థలంలో నుంచి సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. డాగ్‌స్క్వాడ్ తో నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.